Jobs : న్యూఢిల్లీ ఇర్కాన్ లో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ , బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి.

New Delhi Ircon
Jobs : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూ ఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. వివిధ విభాగాల్లో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సిగ్నలింగ్ అండ్ టెలీకమ్యునికేషన్, ఎలక్ట్రికల్ విభాగాల్లో జాయింట్ జనరల్ మేనేజర్ 1ఖాళీ, డిప్యూటజనరల్ మేనేజర్ 1 ఖాళీ, మేనేజర్ 1 ఖాళీ, డిప్యూటీ మేనేజర్లు 2 ఖాళీలు, అసిస్టెంట్ మేనేజర్లు 7 ఖాళీలు, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ మేనేజర్లు 5 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ 6ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ , బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పనిలో అనుభవం కలిగి ఉండాలి. పోస్టుల్ని అనుసరించి నెలకు 30 వేల రూపాయల నుండి 2, 20, 000 వేల రూపాయల వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆప్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపటానికి చివరి తేదిగా ఏప్రిల్ 18, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://www.ircon.org సంప్రదించగలరు.