Tenth Class Exams: టెన్త్ పరీక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆ పద్ధతిలోనే..
గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది.

Tenth Exams
Tenth Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షల మార్కుల విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే మార్కుల విధానం ఉండనుంది. 20శాతం ఇంటర్నర్ మార్కులు కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షల్లో 80 మార్కులు, ఇంటర్నల్ లో 20 శాతం మార్కుల పద్ధతిని కొనసాగించనున్నారు. గతంలో ఇంటర్నల్స్ ఎత్తేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఏడాది కూడా ఇంటర్నల్స్ ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.
టెన్త్ క్లాస్ కు సంబంధించి మార్కుల విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇంటర్నల్ మార్కులు ఎత్తేయాలని అనుకుంది. తాజాగా ఆ నిర్ణయంపై రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. 80 శాతం ఎక్స్‌టర్నల్, 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఈసారి నుంచి ఇంటర్నల్స్ ఎత్తివేసి 100 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించాలని ప్రభుత్వం భావించింది. సాధ్యాసాధ్యాలపై నిపుణులతో చర్చించింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.