Assembly Elections 2023: కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం.. ఆ వెంటనే తూచ్ అంటూ మాట మార్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించడం ఆసక్తిని పెంచింది.

Assembly Elections 2023: కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం.. ఆ వెంటనే తూచ్ అంటూ మాట మార్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

Updated On : November 9, 2023 / 7:05 PM IST

Mallikarjun Kharge: ఛత్తీస్‭గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని చర్చా రైల్వే గ్రౌండ్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేసి వెంటనే వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అదేంటంటే.. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే భూపేష్‌ బాఘేల్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఖర్గే అన్నారు. అంతలోనే మాటమార్చి హైకమాండ్‌ కోరిన వారే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

వాస్తవానికి ఛత్తీస్‭గఢ్ లోని బస్తర్ డివిజన్‌లో ఉన్న 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఆయన భూపేష్ బాఘేల్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని ప్రకటించడం ఆసక్తిని పెంచింది. మళ్లీ అంతలోనే.. ఎన్నికల అనంతరం హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు.

ఇక భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి కావచ్చని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ బైజ్ కూడా అన్నారు. తొలి దశలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు. 20 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలని, ఎందుకంటే మోదీ-ఆర్‌ఎస్‌ఎస్ దేశ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాయని అన్నారు. రాజ్యాంగం ద్వారా పేదలు పొందుతున్న హక్కులను అణగారిన ప్రజలు పొందకూడదని వారు అనుకుంటున్నట్లు విమర్శించారు. వాటిని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌గఢ్‌కు రావాలని, మొత్తం ఐదు రాష్ట్రాలకు రావాలని అన్నారు.