చైనా నుంచి కరోనా.. కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాల అవస్థలు!

  • Published By: sreehari ,Published On : January 30, 2020 / 03:22 AM IST
చైనా నుంచి కరోనా.. కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాల అవస్థలు!

Updated On : January 30, 2020 / 3:22 AM IST

చైనాలోని వుహాన్ నుంచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు రెండు వారాల పాటు ఒక ద్వీపంలో నిర్బంధించనున్నారు. వుహాన్ నుంచి ఖాళీ చేయించిన అమెరికన్లకు కాలిఫోర్నియాలోని ఒక వైమానిక స్థావరంలో తాత్కాలికంగా వసతి కల్పించనున్నారు. దక్షిణ కొరియాలో నిర్బంధానికి నిరాకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉంది. చైనా వెలుపల ఉన్న దేశాలకు, అంటువ్యాధిని నివారించే సమయం ఇప్పుడు ఉంది.

కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు వైరస్ అనుమానిత వ్యక్తులను దూరంగా ఉంచడం ద్వారా అదుపు చేయొచ్చు. చైనాలోని ప్రతి ప్రావిన్స్‌కు పాకిన కరోనావైరస్ బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అక్కడి వారంతా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ 7,700 మందికి పైగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. మరో 170 మంది మరణించారు.

వుహాన్ సిటీలో వైరస్ వెలుగులోకి
అమెరికాతో సహా డజనుకు పైగా దేశాలు రోగులను వేరుచేసి వారిని పర్యవేక్షిస్తున్నాయి. అలాగే చైనా నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించడం అక్కడ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరుతున్నాయి. కానీ ఈ వైరస్ ఎంతమంది సోకిందా లేదా అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2

దాదాపు 1.4 బిలియన్ల జనాభా కలిగిన చైనా.. భూమిపైనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందింది. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 11 మిలియన్ల మంది జనాభా ఉన్న వుహాన్ సిటీలో డిసెంబరులో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ నగరం చుట్టుపక్కల ప్రయాణాలను నిలిపివేసింది. దాదాపు పది లక్షల మందిని బయటకు రాకుండా కట్టడి చేసింది.

చైనా బయటి ప్రాంతాల్లో 68 కేసులు :
‘ఇప్పటివరకూ చైనా బయటి ప్రాంతాల్లో 68 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరణాలు సంభవించలేదు. వైరస్ బాధిత కేసులను నిరోధించడానికి ప్రభుత్వం తీసుకున్న అసాధారణ చర్యలకు ఇది చాలా తక్కువ కాదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక మీడియా సమావేశంలో తెలిపారు.

కానీ ఈ వ్యాధి చైనా లోపల చాలా విస్తృతంగా వ్యాపించింది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనాకు వచ్చి వెళ్లిన విదేశీయుల్లో అనేక దేశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి.

1

ప్రపంచ వ్యాప్తికి మరింత అవకాశం :
ఈ కేసులపై డాక్టర్ టెడ్రోస్ ప్రస్తావిస్తూ… ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.WHO అత్యవసర కమిటీతో మరోసారి సమావేశం కావాలని పిలుపునిచ్చారు. ఈ కమిటీ గత వారం రెండుసార్లు సమావేశమైంది.

అయితే అత్యవసర పరిస్థితిని ప్రకటించాలా వద్దా అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. చైనా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైతే.. ఇతర దేశాలు నిరంతర వైరస్ వ్యాప్తిని నిరోధించాల్సి తప్పని పరిస్థితి. దీనిపై డాక్టర్ ఫౌసీ మాట్లాడుతూ.. 2003లో SARS వైరస్ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రవచ్చు. ఈ వైరస్‌ను అంతం చేయడం కూడా సాధ్యమేనని ఆయన అన్నారు.