Sitting Risks : గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వక తప్పదు..

వర్క్ ప్లేస్‌లో గంటల తరబడి కూర్చుని పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పాటించాల్సిన టిప్స్ న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. ఇప్పుడు ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున్నారు.

Sitting Risks : గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వక తప్పదు..

sitting risks

Updated On : March 31, 2023 / 5:43 PM IST

sitting risks : గంటలతరడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ‘సిట్టింగ్ డిసీజ్’ (sitting disease) గురించి తెలుసుకోవాల్సిందే.. ఇదేదో కొత్త వ్యాధి అనుకుని భయపడకండి. గంటల తరబడి ఒకే చోట కదలకుండా పనిచేస్తే రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. న్యూట్రిషనిస్ట్ అంజలీ ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో దీనికి సంబంధించి టిప్స్ చెబుతూ ఒక వీడియో షేర్ చేశారు.

వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది!

నడక సర్వరోగాలను హరిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది డాక్టర్లు చిన్న వయసువారికి సైతం వాకింగ్ చేయమని సూచిస్తున్నారు. నడక (walking) వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు (heart disease) టైప్ 2 డయాబెటీస్ (type 2 diabetes), ఓస్టియోపొరొసిస్ (osteoporosis) వంటి వాటితో పాటు క్యాన్సర్ (Cancer) బారిన పడకుండా ఉండాలంటే నడక చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఉగ్యోగస్తులు రోజంతా పనిలో పడి ఇంటికి వచ్చాక బద్ధకించి నడకకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. కంటిన్యూగా వర్క్ ప్లేస్‌లలో 8 గంటలకు పైగా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని పనిచేస్తూ ఉండటం వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు (obesity), బ్లడ్ ప్రెజర్ (blood pressure) పెరగడం, హై బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ (cholesterol) స్ధాయి పెరిగే అవకాశం ఉంటుందట. ఇదే పరిస్థితి కొనసాగితే కార్డియో వాస్క్యులర్ వ్యాధులకు (cardiovascular disease) లేదా క్యాన్సర్‌కి దారి తీయవచ్చని చెబుతున్నారు.

Ignoring Social Media : రోజులో కేవలం 15 నిమిషాలు సోషల్ మీడియాను దూరంపెడితే మీ ఆరోగ్యం మెరుగుపడటం ఖాయం !

అయితే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో న్యూట్రిషనిస్ట్ (Nutritionist) అంజలీ ముఖర్జీ (Anjali Mukerjee) ఇన్ స్టాగ్రామ్ లో ‘సిట్టింగ్ డిసీజ్’ పేరుతో ఒక వీడియో షేర్ చేసారు. ఒకే చోట గంటల కొద్దీ కూర్చుని పనిచేయడం కాకుండా ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి లేచి నిలబడటం ద్వారా, లేదా ఒక చిన్న వాక్ చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండొచ్చట. ఇక ఈ వీడియోలో అంజలీ అనేక అంశాలను షేర్ చేశారు. ఆ అంశాలేంటో ఈ క్రింద లింక్ క్లిక్ చేసి వీడియోలో చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anjali Mukerjee (@anjalimukerjee)