ఆపరేషన్ గులాబీ : టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ప్రముఖులు 

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 07:18 AM IST
ఆపరేషన్ గులాబీ : టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ప్రముఖులు 

తెలంగాణ కాంగ్రెస్‌కు సంక్రాంతి షాక్ 

టీఆర్ఎస్‌లోకి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌లో సబిత చేరిక వార్తలపై కాంగ్రెస్‌లో సంచలనం 

కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం

చేవెళ్ల ఎంపీ టికెట్‌ లక్ష్యం

హైదరాబాద్‌: సంక్రాంతి సంబురాలు  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపనున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని రాజకీయ వర్గాల సమచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది.

మాజీ హోంమంత్రి..రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సంక్రాంతిపండుగ తరువాత ఈ రాజకీయ ప్రక్రియ జరగనున్నట్లు సమచారాం. ఈ ఆరుగురు తరువాత మరో నలుగురైదుగురు రెండో విడతలో టీఆర్‌ఎస్‌లో చేరతారని వార్తలు నమ్మకంగా వస్తున్నాయి.

యూరప్ నుండి తిరిగి వచ్చిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఈ అంశంపై దృష్టి పెట్టి సదరు ఎమ్మెల్యేలకు ఉత్తమ్ ఫోన్ చేయగా వారంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లగా తెలుస్తోంది.   ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్న సదరు ఎమ్మెల్యేలంతా సంక్రాంతి పండుగ తరువాత టీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. తొలి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి ఆశించారు. అయితే పొత్తులో భాగంగాఆ సీటును టీడీపీకి కేటాయించింది. దాంతో కార్తిక్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ లో చేరితే కుమారుడికి ఎంపీ సీట్ వస్తుంనే ఆలోచనతో సబితా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చెవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని భావిస్తున్న సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 

అలాగే ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్నారు.వారితోపాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం ఊపందకుంది. ఆయనతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని రాజకీయ నేతల సమాచారం.