ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు 

తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 08:11 AM IST
ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు 

Updated On : January 25, 2019 / 8:11 AM IST

తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

హైదరాబాద్‌ : తెలంగాణలో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో వాయిదా పడ్డ వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జనవరి 21న జరిగిన సంగతి తెలిసిందే. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఈసీ పరిశీలించింది.

 

నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్‌ వాయిదా పడింది. సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు. సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు బ్యాలెట్‌ పేపర్‌పై బ్యాట్‌ గుర్తుకు బదులు కప్పు సాసర్‌ రావడంతో అధికారులు పోలింగ్‌ను రద్దు చేశారు. ఐయితే యధావిధిగా కొనసాగుతున్న వార్డ్‌మెంబర్‌ ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. వెంటనే సర్పంచ్‌ ఎన్నికలు జరపాలంటూ పట్టుబట్టారు.

 

రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు జనవరి 25న పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. ఉప సర్పంచిని ఎన్నుకోనున్నారు.