హైదరాబాద్‌లో కుండపోత వర్షం, రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై ఇబ్బందులు తలెత్తితే అత్యవసర సేవల కోసం రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటించింది. సిటీలో ఇప్పటికే కూకట్ పల్లి, సికింద్రాబాద్, కాప్రా, కంటోన్ మెంట్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది.
ఆకాశం మొత్తం మేఘావృతం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గంటకే దట్టమైన మేఘాలు కమ్మేశాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. రోడ్లపై నీళ్లు నిలిచే అవకాశం ఉందని.. ట్రాఫిక్ జాం అవుతుందని సూచించింది.
జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీం. వర్షం, ట్రాఫిక్ రద్దీను దృష్టిలో పెట్టుకుని రోడ్లపైకి రావాలని కోరారు అధికారులు. నగరం మరోసారి తడిసిముద్దవుతోంది. భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.