వద్దంటే వాన : హైదరాబాద్ లో భారీ వర్షం

వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 10:45 AM IST
వద్దంటే వాన : హైదరాబాద్ లో భారీ వర్షం

Updated On : September 24, 2019 / 10:45 AM IST

వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.

వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 4 గంటలకే చీకట్లు అలుముకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్మేశాయి. వర్షం దంచికొట్టడంతో రోడ్లు జలమయం అయ్యాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

 
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మూడు రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం చల్లగా మారింది. ఈ వర్షాలకు పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. హోర్డింగులు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఆదివారం( సెప్టెంబర్ 22, 2019) కూడా భారీగా వర్షం పడగా.. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో యువతిపై పెచ్చులు ఊడిపడి చనిపోయింది. అటువంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.