ప్రయాణీకులకు గమనిక : దసరా, దీపావళి..ప్రత్యేక రైళ్ల వివరాలు

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 02:26 AM IST
ప్రయాణీకులకు గమనిక : దసరా, దీపావళి..ప్రత్యేక రైళ్ల వివరాలు

Updated On : September 20, 2019 / 2:26 AM IST

పండుగ సీజన్ వచ్చేస్తోంది. మరో వారం రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైళ్లు టికెట్లు బుక్ చేయించుకుంటున్నారు. అయితే..ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. తాజాగా దసరా, దీపావళి పండుగల సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ప్రకటించారు. 

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి : – 
> హైదరాబాద్ – ఎర్నాకులం (07117/07118) అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.50కి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30కి ఎర్నాకులం చేరుకుంటుంది. 
తిరుగు ప్రయాణం (ఎర్నాకులం – హైదరాబాద్) అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో ఎర్నాకులంలో రాత్రి 9.30కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.55కి నాంపల్లికి చేరుకుంటుంది. 
> కాచిగూడ – శ్రీకాకుళం (07148/07147) అక్టోబర్ 6, 13, 20, 27, నవంబర్ 3, 10, 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 6.45కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55కి శ్రీకాకుళం చేరుకుంటుంది. 
తిరుగు ప్రయాణం (శ్రీకాకుళం – కాచిగూడ) అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 5.15కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది. 
> హైదరాబాద్ – కొచువెలి (07115/07116) అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి రెండో రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుంటుంది. 
తిరుగు ప్రయాణం (కొచువెలి – హైదరాబాద్) అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 7.45కి కొచెవెలి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. 
Read More : హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ రూ.1.4కోట్ల మోసం