మరో సమరం : 20న స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మూడు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనుంది. 535 జడ్పీటీసీలు, 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం కోటి 56 లక్షల 11 వేల 320 మంది ఓటర్లున్నారు. ఇందుకు 32 వేల 007 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 18వ తేదీ గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వాహణపై చర్చిస్తున్నారు.
– తొలి విడతలో 212 జడ్పీటీసీలు, 2 వేల 365 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.
– రెండో విడతలో 199 జడ్పీటీసీలు, 2 వేల 109 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.
– మూడో విడతలో 124 జడ్పీటీసీలు, 1, 343 ఎంపీటీసీలకు ఎన్నికలు.
– ఏప్రిల్ 22వ తేదీన మొదటి విడత నోటిఫికేషన్..మే 6వ తేదీన పోలింగ్.
– ఏప్రిల్ 26వ తేదీన రెండో విడత నోటిఫికేషన్. మే 10న పోలింగ్.
– ఏప్రిల్ 30వ తేదీన మూడో విడత నోటిఫికేషన్. మే 14న మూడో పోలింగ్.