పెరుగుతున్న ఎండలు : మండుతున్న కూరగాయల ధరలు 

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 06:37 AM IST
పెరుగుతున్న ఎండలు : మండుతున్న కూరగాయల ధరలు 

Updated On : April 8, 2019 / 6:37 AM IST

హైదరాబాద్: వేసవికాలం వచ్చిదంటే చాలు కూరగాయల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. నీటి సరఫరా తగ్గుదలతో కూరగాయల దిగుబడి తగ్గటం వంటి కారణాలతో కూరగాయల ధరలు వేసవికాలంలో పెరుగుతుంటాయి. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండటంతో ఆ ప్రభావం కూరగాయల దిగుబడిపై పడింది. నగరం మార్కెట్లకు సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రజల అవసరాలకుతగినంత కూరగాయలు లభించకపోవటం రేట్లు అమాంత పెంచేసారు వ్యాపారులు. రైతు బజారుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 
ఈ క్రమంలో నీటికొరత..ఉన్నట్టుండి పడిన అకాల వర్షాలు కూడా కూరగాయల పంటలపై పడింది. దీంతో ధరలు ఒక్కసారిగా 50 శాతం మేరకు పెరిగిపోయాయి. 
 

ముఖ్యంగా పచ్చిమిర్చి,  బీన్స్, టొమాటో, బీర వంటి కూరగాయల పంట దిగుబడి తగ్గిపోవటంతో వీటి ధరలు పెరిగిపోయాయి. ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయలు విక్రయించిన వికారాబాదుకు చెందిన రైతు శేఖర్ మాట్లాడుతు.. ప్రస్తుతం ధరల కంటే మరింతగా పెరుగే అవకాశాలున్నాయిన తెలిపారు. ఇలా ఎండలు పెరుగుతున్న క్రమంలో మే నెలలో మరింత పెరిగిపోతాయన్నారు. సరఫరా క్రమంగా తగ్గిపోతోందనీ..అలాగే ఆకు కూరలు కూడా ధరలు పెరిగుతాయని చెప్పారు.ఈ క్రమంలో హైదరాబాద్ లోని పలు రైతు బజార్లలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

టమోటో రూ.15-25  రూ.32
పచ్చిమిర్చి  రూ. 40-45  రూ.55
పెద్ద మిర్చి రూ.45-50  రూ.75
బీన్స్ రూ. 65-70  రూ.85
కాప్సికమ్ రూ. 40  రూ.60
బీరకాయలు రూ.45  రూ.55