కరోనాకు విరుగుడు ఇదే : సమూహ రోగ నిరోధక శక్తి

ప్రపంచాన్ని కరోనా భయపెడుతోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. దీనికి ఇంకా మందును కనిపెట్టడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఇది ఒక విధంగా నిరోధించవచ్చని..కానీ..సమూహ రోగ నిరోధక శక్తి కూడా ఒక మందులాంటిదే అంటున్నారు. ప్రతి వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా..ఇదేంది అనేగా మీ డౌట్. ప్రధానంగా వైరస్ లు సమాజంలో ఛైన్ మాదిరిగా వ్యాపిస్తుంటాయి. వీటిని ఎదుర్కొనే క్రమంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే.. ఈ వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు నిపుణులు. ఇందుకు రెండు మార్గాలుంటాయన్నారు.
1. సూక్ష్మజీవులు దాడి చేసిన సమయంలో శరీరం స్పందించి…యాంటిబాడీలు తయారు చేయడం. 2. వ్యాక్సిన్లను తయారు చేయడం. ఎదైనా వైరస్ పుట్టుకొచ్చినప్పుడు దీనికి వైరస్ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ప్రమాదకర (కరోనా) వైరస్ లను అరికట్టాలంటే…సమూహ రోగనిరోధక శక్తిని పెంపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యధిక శాతం జనాభాలో యాంటీబాడీలు ఉత్పతి కావాలని సూచిస్తున్నారు. వృద్దులను, చిన్నారులను ఇంటికే పరిమితం చేయ్యాలి.
సహజ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే…యువతను బయటకు పంపాల్సి ఉంటుంది. ఇందులో కొందరికి వ్యాధి సోకినా..వెంటనే తక్కువ చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత ఫలితాలను బట్టి మహిళలు, పిల్లలు, వృద్దులను బయటకు పంపుతారు. వీరిలో వైరస్ సోకితే..తగ్గించే వైద్య వ్యవస్థను సిద్ధం చేయాల్సి ఉంటుందంటున్నారు. సహజ రోగ నిరోధక శక్తి పెరగాల్సి ఉంటుందని, ఇందుకు సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామం చేస్తూ..రోగ నిరోధక శక్తి వృద్ధి చేసుకోవచ్చంటున్నారు.