Egypt Mummies: ఈజిప్టులో 2,500 ఏళ్ల నాటి 250 కళాఖండాలను, ఆకృతులను వెలికి తీసిన పురావస్తుశాఖ

క్రీ.పూ. 500వ సంవత్సరం చివరి కాలానికి చెందిన 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు, ఇతర వస్తువులు ఈ తాజా తవ్వకాల్లో బయటపడ్డాయని ఈజిప్టు పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Egypt Mummies: ఈజిప్టులో 2,500 ఏళ్ల నాటి 250 కళాఖండాలను, ఆకృతులను వెలికి తీసిన పురావస్తుశాఖ

Egypt

Updated On : May 31, 2022 / 2:11 PM IST

Egypt Mummies: ఆధునిక చరిత్రకు ముందు..మానవుల అభివృద్ధికి మొదటి పాద ముద్రగా చెప్పుకుంటున్న ఈజిప్ట్ లో..నేటికీ పురావస్తు శాఖలాలు బయటపడుతూనే ఉన్నాయి. 2500 ఏళ్ల నాటివిగా భావిస్తున్న 250 కళాఖండాలను, ఆకృతులను తాజాగా వెలికితీసిన అక్కడి పురావస్తుశాఖ అధికారులు..వాటిని ఇటీవల మీడియా ఎదుట ప్రదర్శనకు ఉంచారు. పీరమిడ్లకు నిలయమైన కైరో సమీపంలోని సక్కారా సమీపంలో ప్రసిద్ధ నెక్రోపోలిస్ వద్ద ఇవి కనుగొనబడ్డాయి. క్రీ.పూ. 500వ సంవత్సరం చివరి కాలానికి చెందిన 250 శవపేటికలు, 150 కాంస్య విగ్రహాలు, ఇతర వస్తువులు ఈ తాజా తవ్వకాల్లో బయటపడ్డాయని ఈజిప్టు పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కళాఖండాలలో అనూబిస్, అమున్, మిన్, ఒసిరిస్, ఐసిస్, నెఫెర్టమ్, బాస్టెట్ మరియు హాథోర్ అనే దేవతల విగ్రహాలతో పాటు సక్కారా పిరమిడ్ ను నిర్మించిన వాస్తుశిల్పి ఇమ్హోటెప్ యొక్క తలలేని విగ్రహం కూడా ఉంది. పురాతన ఈజిప్టు వాస్తుశిల్పి ఇమ్హోటెప్..క్రీ.పూ. 2630 క్రీ.పూ. 2611 మధ్య.. ఈజిప్టును పరిపాలించిన ఫరో డ్జోసర్ యొక్క ఆస్థాన శిల్పిగా ఉండేవాడు.

other stories: PM Modi: “నేను ప్రధాన మంత్రిని కాదు.. 130కోట్ల మందికి ప్రధాన సేవకుడ్ని మాత్రమే”

తాజాగా వెలికి తీసిన ఈ శవపేటికలు, ఇతర కళాకృతులను సక్కారాలోని స్టెప్ పిరమిడ్ ఆఫ్ డ్జోసర్ వద్ద ఒక తాత్కాలిక ప్రదర్శనలో విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఎంతో పురాతనమైన ఈ శవపేటికలపై రంగులద్ది ఉన్నాయని..వీటిలో మమ్మీలు, తాయెత్తులు ఇతర పురాతన వస్తువులు ఉన్నట్లు ఆంటిక్విటీస్ సుప్రీం కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముస్తఫా వజీరి చెప్పారు. ఈజిప్టు పురాణాల్లో సంతానోత్పత్తి దేవత అయిన ఐసిస్ మరియు నెఫ్తిస్ అనే దేవతల చెక్క విగ్రహాల కూడా ఉండగా..ఆ విగ్రహాల ముఖాలకు బంగారు తొడుగు ఉంది. సౌదర్య సాధనాలు దాచుకునే పెట్టెలతో పాటు కంకణాలు, చెవిరింగులు వంటి ఆభరణాలు కూడా బయటపడ్డాయి. ఈజిప్ట్ యొక్క పురాతన రాజధాని మెంఫిస్ వద్ద ఉన్న విస్తారమైన నెక్రోపోలిస్ ప్రాంతాన్ని 1970లలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

other stories: No Smartphones: 2030 నాటికి స్మార్ట్ ఫోన్స్ మాయం: మరేం ఉంటాయి?