వరల్డ్ రికార్డు బ్రేక్ : ఉల్లిగడ్డ సైజులో పుట్టిన బుడ్డోడు

పుట్టే పిల్లలు బరువు తక్కువగా పుడతారని తెలుసు. పుట్టిన సమయంలో బేబీలకు అనారోగ్య సమస్యలు ఉండటం సర్వసాధారణం. జపాన్ లో పుట్టిన ఓ బుడ్డోడు చూడటానికి ఉల్లిగడ్డ అంత సైజులో పుట్టి ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు.

  • Published By: sreehari ,Published On : March 1, 2019 / 01:08 PM IST
వరల్డ్ రికార్డు బ్రేక్ : ఉల్లిగడ్డ సైజులో పుట్టిన బుడ్డోడు

Updated On : March 1, 2019 / 1:08 PM IST

పుట్టే పిల్లలు బరువు తక్కువగా పుడతారని తెలుసు. పుట్టిన సమయంలో బేబీలకు అనారోగ్య సమస్యలు ఉండటం సర్వసాధారణం. జపాన్ లో పుట్టిన ఓ బుడ్డోడు చూడటానికి ఉల్లిగడ్డ అంత సైజులో పుట్టి ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు.

పుట్టే పిల్లలు బరువు తక్కువగా పుడతారని తెలుసు. పుట్టిన సమయంలో బేబీలకు అనారోగ్య సమస్యలు ఉండటం సర్వసాధారణం. జపాన్ లో పుట్టిన ఓ బుడ్డోడు చూడటానికి ఉల్లిగడ్డ అంత సైజులో పుట్టి ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు. మీరు చదివింది నిజమే. అంతేకాదండోయ్.. బరువు తక్కువగా పుట్టినప్పటికీ శిశువు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడట. 2018 ఆగస్టులో జపాన్ డాక్టర్లు ఓ మహిళకు ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు.
Read Also : ఫోర్ బోనస్ : 24 వేళ్లతో పుట్టిన బాబు

అప్పటికే మహిళ కడుపులో ఉన్న శిశువు బరువు పెరగడం ఆగిపోయింది. శిశువు బతికే అవకాశం లేదని డాక్టర్లు కూడా తేల్చేశారు. డెలివరీ అనంతరం జపాన్ వైద్యులు.. బరువు తక్కువగా పుట్టిన మగశిశువుకు ఇంటెన్షివ్ కేర్ యూనిట్ పై శ్వాస అందించారు. ఎప్పటికప్పుడూ న్యూట్రిషన్ అందిస్తూ కొన్నిరోజుల పాటు ట్రీట్ మెంట్ చేసినట్టు జపాన్ టైమ్స్ పేర్కొంది. దీంతో పుట్టినప్పుడు బరువు తెలియదుగానీ, ట్రీట్ మెంట్ అనంతరం శిశువు బరువు 3.2 కిలోగ్రాముల మార్క్ ను దాటేశాడు.

శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జీ చేశారు. డెలివరీ అనంతరం శిశువు తల్లి మాట్లాడుతూ.. అద్భుతం..దేవుడు ఉన్నాడు.. ఇది నమ్మలేకపోతున్నాను. నిజానికి నా బిడ్డ నాకు దక్కడేమో అనుకున్నా. దేవుడి దయ వల్ల నా కుమారుడు 3.2 కేజీల బరువు పెరిగాడు’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

2009లో జర్మనీలో 274 గ్రాముల బరువుతో మగశిశువు జన్మించి రికార్డు సృష్టించాడు. అప్పటి రికార్డును జపాన్ లో పుట్టిన ఈ బుడ్డోడు 3.2 కేజీల బరువు పెరిగి పాత రికార్డు బ్రేక్ చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ లోవాకు చెందిన టినెస్ట్ బేబీస్ రిజస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది.

అంతకుముందు 2015లో జర్మనీలో 252 గ్రాముల బరువుతో ఆడ శిశువు జన్మించినట్టు రిజస్ట్రీ తెలిపింది. అయితే పుట్టిన సమయంలో బేబీ బరువు ఎంతో ఉందో వివరాలు తెలియనిప్పటికీ.. అంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు బతకడం నిజంగా చాలా కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
Read Also : ఉప్పల్‌లో వన్డే: కేఎల్ రాహుల్‌ కొనసాగుతాడా? షమీ, కుల్దీప్‌ల సంగతేంటి?