పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్టెప్పులేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దుబాయ్ లో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థ వేడుక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్టెప్పులేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దుబాయ్ లో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థ వేడుక
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్టెప్పులేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దుబాయ్ లో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నాయకులు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. సంగీత్ కార్యక్రమంలో పవన్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలోని బాపుగారి బొమ్మ పాటకు తన భార్యతో కలిసి సీఎం రమేశ్ డ్యాన్స్ చేశారు. ఆయన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీఎం రమేశ్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ దుబాయ్‌లో ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దుబాయ్‌లోని వాల్డార్ఫ్ అస్టోరియా హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఇండియా నుంచి తరలివెళ్లిన అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇందులో టీడీపీ, వైసీపీతోపాటు దేశంలోని పలుపార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. ఏకంగా 17 ప్రత్యేక విమానాల్లో అతిథులను దుబాయ్ తరలించిన సీఎం రమేశ్… అక్కడ వారికి మర్చిపోలేని అతిథ్యమిచ్చారు. దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ వరకు తీసుకెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి మరీ స్వాగతం పలికారు. అయితే.. రెండు కుటుంబాలకు పరిమితమైన ఈ ఫంక్షన్‌కు అన్ని పార్టీల లీడర్లు హాజరవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టీడీపీ, వైసీపీ నేతలకు వల వేయడానికి బీజేపీ… ఈ నిశ్చితార్థ వేడుకను ఉపయోగించుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఈ సందర్భంగా.. బీజేపీలో చేరే విషయమై చర్చించారనే టాక్ వినిపిస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని సీఎం రమేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని బలపరుస్తున్నాయని చెబుతున్నారు.