గాల్లో విమానం..పైలెట్ పై పిల్లి దాడి..తర్వాత ఏం జరిగిందంటే..

Cat in Flight..Attack on the pilot : ఓ పిల్లి విమానంలోకి ఓ చొరబండిందో తెలీదుగానీ..విమానం టేకాఫ్ అయ్యాక రచ్చ రచ్చ చేసింది. ఏకంగా పైలెట్ పైనే దాడి చేసింది. దీంతో విమానం ఎమర్జన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం కాక్ పిట్‌లో ఏర్పడిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ పిల్లి దెబ్బకు విమానాన్ని గాల్లోనే యూటర్న్ చేసి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సూడాన్ లో జరిగింది.
ఖతార్ రాజధాని దోహాకు వెళ్లవలసిన విమానం అనుకున్న టైముకే బయలుదేరింది. కానీ..విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ పిల్లి చేసిన హడావిడికి సుడాన్ రాజధాని నగరమైన కార్టూమ్‌లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. సుడాన్ టార్కో విమానం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. బయలు దేరిందే గానీ చేరాల్సిన గమ్యానికి చేరుకోలేదు.
స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఓ పిల్లి విమానం బయలుదేరే ముందు ఎలా జొరబడిందో గానీ కాక్ పిట్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కాక్‌పిట్‌లో పిల్లి చొరబడిందని గమనించిన సిబ్బంది..దాన్ని కాక్ పిట్ నుంచి బయటకు పంపేయడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఈ క్రమంలో అది కెప్టెన్‌పై కూడా దాడి చేసింది.
కాక్ పిట్‌లో ఏర్పడిన ఈ గందరగోళానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. పైలట్‌కు మరో దారి లేక ఖార్టూమ్‌కు తిరిగి రావడం తప్పనిసరి అయ్యింది. ఇంతకీ ఈ విమానంలోకి పిల్లి ఎలా వచ్చిందో మాత్రం తెలియదు. అయితే విమానం లోపల క్లీన్ చేసేటప్పుడో..లేదా..ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఈ పిల్లి ఆన్ బోర్డ్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విమానం ప్రయాణానికి ముందు రోజు రాత్రి అదే విమానాశ్రయంలో ఒక హ్యాంగర్ దగ్గర హాల్ట్‌లో ఉంది. ఇలా ఆగి ఉన్న సమయంలో ఈ పిల్లి విమానంలోకి వెళ్లి ఉంటుందనే డౌట్స్ వస్తున్నాయి. మొత్తంగా విమానంలో పిల్లి సృష్టించిన బీభత్సానికి పైలట్లతో పాటు ప్రయాణికులు, అధికారులు బెంబేలెత్తిపోయారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు..విమాన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.