కలిసి నివసించే వారిలో కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుంది, స్టడీ

మానవాళికి ముప్పుగా మారిన కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకు యావత్

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 06:41 AM IST
కలిసి నివసించే వారిలో కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుంది, స్టడీ

Updated On : June 19, 2020 / 6:41 AM IST

మానవాళికి ముప్పుగా మారిన కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకు యావత్

మానవాళికి ముప్పుగా మారిన కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. ఈ మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం వణుకుతోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలను మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే లక్షల మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే కరోనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ గురించి జరుగుతున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. 

కుటుంబాల్లో సులభంగా వైరస్ వ్యాప్తి:
ఎక్కువమంది ఒకే ఇంట్లో కలిసి నివసించే కుటుంబాల్లో కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుందని ఓ అధ్యయనంలో తెలిసింది. కరోనా బారిన పడ్డ వ్యక్తిలో లక్షణాలు కనిపించకుండానే వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. లక్షణాలు లేకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనను లాన్సెట్ ఇన్ ఫెక్షియస్ డిసీజస్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. సార్స్ లేదా మెర్స్ కన్నా కోవిడ్ 19 చాలా సులభంగా ఒకే ఇంట్లో ఉండే కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు తెలిపారు.

ఒకే ఇంట్లో ఎక్కువమంది ఉండేవారు జాగ్రత్త:
చైనాలో గ్వాంగ్ జౌలో 349 మంది కరోనా బాధితులు, వారికి చెందిన దగ్గరి కుటుంబసభ్యులు 1964మందిపై పరిశోధకులు స్టడీ చేశారు. వారిలో చాలామందిలో లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకినట్టు తేలిందన్నారు. కుటుంబసభ్యుల్లో 60ఏళ్లకు పైబడిన వారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. సమయానికి వైరస్ బాధితులను గుర్తించడం వారితో పాటు కుటుంబసభ్యులు, క్లోజ్ కాంటాక్ట్స్ ను క్వారంటైన్ చేయడం ద్వారా కరోనా వైరస్ కేసులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. సో, ఒకే ఇంట్లో ఎక్కువ మంది సభ్యులతో నివసించే కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 85లక్షల కరోనా కేసులు:
2019 డిసెంబర్ లో చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 85లక్షల 78వేల 52 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. 4,56,284 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 45లక్షల 30వలే 261 మంది కోలుకున్నారు. 35లక్షల 91వేల 507 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

కరోనా కేసుల్లో అగ్రస్థానంలో అమెరికా:
ప్రపంచంలో కరోనా కేసుల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కంటిన్యూ అవుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 22లక్షల 63వేల 651 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన లక్షా 20వేల 688 మంది మరణించారు. 12లక్షల 11వేల 969 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9లక్షల 30వేల 994 మంది బాధితులు కోలుకున్నారు. 9లక్షల 83వేల 359 పాజిటివ్‌ కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్ లోఇప్పటివరకు 47,869 మంది మరణించగా.. 5,20,360 మంది కోలుకున్నారు. మరో 4,15,130 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రష్యాలో మొదట్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, మాస్కో కేంద్రంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో దేశంలో ఇప్పటివరకు 5,61,091 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 7660 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 2,39468 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,13,963 మంది బాధితులు కోలుకున్నారు. 

4వ స్థానంలో భారత్:
నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటివరకు 3,81,091 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల దేశంలో 12,604 మంది మరణించగా, 2,05,182 మంది కోలుకున్నారు. మరో 1,63,305 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3 లక్షల 469 కేసులతో యూకే ఐదో స్థానంలో కొనసాగుతోంది. యూకేలో ఇప్పటివరకు 42,288 మంది మృతిచెందారు. మెక్సికోలో నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5662 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 667 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,65,455కు చేరగా, మృతులు 19,747కి పెరిగింది. అత్యధిక కరోనా కేసుల జాబితాలో స్పెయిన్‌ (2,92,348 కేసులు), పెరూ (2,44,388), ఇటలీ (2,38,159), చిలి (2,25,103), ఇరాన్‌ (1,97,647 కేసులు) ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా? ఈ మహమ్మారి పీడ విరగడ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

Read: బీజింగ్ ఫుడ్ మార్కెట్‌లోని సీఫుడ్, మాంసదుకాణాల్లో భారీగా కరోనా వైరస్ జాడలు