Tik Tok కి 90 రోజులు గడువిచ్చిన ట్రంప్

  • Published By: murthy ,Published On : August 16, 2020 / 07:55 AM IST
Tik Tok కి 90 రోజులు గడువిచ్చిన ట్రంప్

Updated On : August 16, 2020 / 8:35 AM IST

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 90 రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అమెరికాలో టిక్‌టాక్‌ కార్యకలాపాలను మరో సంస్థకు విక్రయించడంగానీ, అమెరికన్ల డేటాను తొలిగించివేయడంగానీ చేయాలని ఆదేశించారు.



టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసినా, టిక్‌టాక్‌ తన వద్ద ఉన్న అమెరికన్‌ యూజర్ల డేటాను తొలగించాలని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్‌ తెలిపారు.