ముగిసిన ఓట్ల లెక్కింపు: ఓడిన అధికార పార్టీ.. మోడీ అభినందనలు

  • Published By: vamsi ,Published On : November 17, 2019 / 11:52 AM IST
ముగిసిన ఓట్ల లెక్కింపు: ఓడిన అధికార పార్టీ.. మోడీ అభినందనలు

Updated On : November 17, 2019 / 11:52 AM IST

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి శ్రీలంకలో శనివారం(16 నవంబర్ 2019) ఎన్నికలు జరగగా.. అధ్యక్ష పీఠం కోసం మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, ప్రతిపక్ష అభ్యర్థి గొటబయా రాజపక్సే(శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే సోదరుడు), అధికార నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నేత సాజిత్‌ ప్రేమదాస మధ్య పోటీ జరిగింది.

పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవ గొటబయా రాజపక్సే 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ప్రేమదాసను ఓడించారు. శ్రీలంకలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఐదేళ్ల కాలం పూర్తి కాగా ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో పదవీ విరమణ చేయనున్నారు మైత్రిపాల సిరిసేన. రాజపక్సే 52.25 శాతం ఓట్లు సాధించగా, పోల్ అయిన మొత్తం ప్రేమదాసకు 41.99 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇతర అభ్యర్థులకు 5.76 శాతం ఓట్లు వచ్చాయి.

గోటబాయ రాజపక్సే అంతకుముందు లెప్టినెంట్ కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అధికార పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రేమదాసను విశ్వసించలేదు అక్కడి ప్రజలు. ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రవాత మారణహోమం శ్రీలంకలో తీవ్ర ప్రభావం చూపింది. ఉగ్రవాదంను ఆపడంతో ప్రభుత్వం విఫలం అవడమే కాక.. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక మాంద్యం ఉంది.

ఈ క్రమంలో రాజపక్సే ప్రజల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా బౌద్దులు రాజపక్సేకు మద్దతు పలికారు. ఈ క్రమంలోనే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సేకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. గోటబాయ మీకు కంగ్రాట్స్, శాంతి స్థాపన కోసం, ఉగ్రవాదంపై పోరాడేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని మోడీ కోరారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.