భారత్ సహా 22 దేశాలలో 10వేల కంటే ఎక్కువ కరోనా కేసులు 

  • Published By: sreehari ,Published On : April 16, 2020 / 01:18 AM IST
భారత్ సహా 22 దేశాలలో 10వేల కంటే ఎక్కువ కరోనా కేసులు 

Updated On : April 16, 2020 / 1:18 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ 22 దేశాలలో ఒక్కొక్కటి 10వేల కంటే ఎక్కువ COVID-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో భారతదేశం ఒకటిగా చెప్పవచ్చు. కానీ ఈ దేశాలతో పోలిస్తే భారతదేశ పురోగతి నెమ్మదిగా ఉంది. దేశంలో కరోనా కేసుల టెస్టింగ్ రేటు ప్రపంచంలో అత్యల్పంగా ఉందని తెలిపింది. భారతదేశ టెస్టింగ్ రేట్లు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉన్నట్టు కనిపిస్తోంది. 

కేసుల పురోగతి : 
నిర్దిష్ట సంఖ్యలో కేసులను దాటడానికి భారతదేశం కంటే ఎక్కువ రోజులు (బ్లూ) లేదా తక్కువ రోజులు (పర్పుల్) తీసుకున్న దేశాల శాతంగా చార్ట్ చూపిస్తుంది.
ఉదాహరణకు, 27శాతం దేశాలు భారతదేశం కంటే 5,000 నుండి 10,000 కేసులకు చేరడానికి ఎక్కువ రోజుల సమయం పట్టింది. 68శాతం దేశాలు తక్కువ రోజులు పట్టింది. ఒక దేశం ఒక మార్కును చేరుకోవడానికి ఎక్కువ రోజులు తీసుకుంటే మంచిదని ఓ నివేదిక చెబుతోంది. 

మరణాల పురోగతి : 
నిర్దిష్ట సంఖ్యలో మరణాలను దాటడానికి భారతదేశం కంటే ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు తీసుకున్న దేశాలకు చార్ట్ పరిశీలిస్తే.. ఉదాహరణకు, 19శాతం దేశాలు భారతదేశం కంటే 250 నుండి 350 మరణాలకు ఎక్కువ రోజులు పట్టింది. 71శాతం దేశాలు తక్కువ రోజులు తీసుకున్నాయి. ఒక దేశం ఒక మార్కును చేరుకోవడానికి ఎక్కువ రోజులు తీసుకుంటే మంచిదని నివేదిక తెలిపింది. 

మరణాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయి?
భారతదేశం టెస్టింగ్ రేట్లలో వెనుకబడి ఉందనే చెప్పాలి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశ పరీక్ష రేట్లు పేలవంగా కొనసాగుతున్నాయి. మార్చి 24, ఏప్రిల్ 3, ఏప్రిల్ 13 నాటికి ఎంచుకున్న దేశాలలో మిలియన్ జనాభాకు పరీక్షలను పట్టిక పోల్చింది. ఏప్రిల్ 13 నాటికి భారతదేశం పరీక్ష రేటు పాకిస్తాన్ మినహా లిస్టెడ్ దేశాల మార్చి 24 రేటు కంటే వెనుకబడి ఉంది.
chart

Also Read |  లాక్ డౌన్ : ఏపీలో రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం