లాక్ డౌన్ : యోగా వైపు అమెరికన్ల చూపు

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 15, 2020 / 01:53 PM IST
లాక్ డౌన్ : యోగా వైపు అమెరికన్ల చూపు

Updated On : April 15, 2020 / 1:53 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో  మార్చి 30 నుంచి ప్రరంభమైన ఆన్ లైన్ యోగా తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. ప్రధాని మోడీ ఇది వరకే స్పష్టం చేసినట్లు.. ఈ క్షిష్ట సమయంలో యోగాభ్యాసం అనేది ప్రజలను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతుందని అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సంధూ వెల్లడించారు.

యోగా ఆన్ లైన్ తరగతులకు అమెరికావాసుల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ధ్యానం, యోగా, శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేయాలని అక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ జోష్వా గోర్డన్ సూచిస్తున్నారు. గతంలోనూ అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు, వైద్యులు యోగ్యాభ్యాసాన్ని ప్రోత్సహించారు.