విమానంలో మంటలు: 41మంది మృతి

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 12:52 AM IST
విమానంలో మంటలు: 41మంది మృతి

Updated On : May 6, 2019 / 12:52 AM IST

రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక విమానం అత్యవసరంగా లాండ్ అవడానికి చేసిన ప్రయత్నంలో ప్రమాదం జరగగా 41మంది చనిపోయారు. అలాగే మరో 6మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తగంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా విమానంను దించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకి మంటలు చెలరేగాయి. చెలరేగిన మంటలు కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలోకి మంటలు పూర్తిగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 78 మంది ఉండగా.. 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే విమానంలో ఎటువంటి సాంకేతిక లోపం తలెత్తింది అనే విషయం తెలియరాలేదు.

ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భద్రతా నియమాలను పైలట్లు ఏమైనా ఉల్లంఘించారా? అనే అంశాలను తీసుకుని ఈ కమిటీ దర్యాప్తు చేపట్టింది.