మోడీని విమర్శిస్తున్న సమయంలో పాక్ మంత్రికి కరెంట్ షాక్

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 12:15 PM IST
మోడీని విమర్శిస్తున్న సమయంలో పాక్ మంత్రికి కరెంట్ షాక్

Updated On : August 30, 2019 / 12:15 PM IST

కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు ఎరిగి ఉన్నాం నరేంద్రమోడీ అంటున్న సమయంలో మంత్రికి షాక్ కొట్టింది. వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మంత్రి తేరుకుని మళ్లీ మట్లాడారు. తనకు కొట్టిన కరెంట్ షాక్ ను పట్టించుకోనన్నారు. భారత ప్రధాని మోడీ ఈ మీటింగ్ ను విఫలం చేయలేడని అన్నారు. 

మంత్రి మోడీ గురించి మాట్లాడుతున్న సమయంలో షాక్ కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడే మిమ్మల్ని శిక్షిస్తున్నాడు చూశారుగా..ఇంకొంచెం షాక్ గట్టిగా తగలాల్సిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఇకపై ఇంతకన్నా పెద్ద షాక్ లు తగులుతాయంటూ పాక్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పుడైనా పాక్ మంత్రి గారికి మైండ్ సరైయిందా లేక మరో షాక్ కి రెడీ అయ్యాడా అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతున్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అనవసరపు వ్యాఖ్యలు,పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని పాక్ కు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.