కరోనా వైరస్ ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ రద్దు కావొచ్చు!

గతవారమే, టోక్యోలో కరోనావైరస్ ప్రభావం పెద్దగా లేదని.. ఈ వేసవిలో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎలాంటి అంతరాయం కలుగబోదని టోక్యో ఒలింపిక్స్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆ విషయం చెప్పిన ఏడు రోజుల తర్వాత కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. కరోనా దెబ్బతో ఒలింపిక్స్ గేమ్స్ తీవ్ర ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తోంది.
ఓ క్రొత్త నివేదిక ప్రకారం.. ఒలింపిక్స్ గేమ్స్ టోక్యో వేదిక నుంచి తరలించడం లేదా పూర్తిగా గేమ్స్ టోర్నమెంట్ రద్దు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వైరస్ ఆసియా అంతటా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ ప్రాంతం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక మాంద్యాలతో భారం పడనుంది. ఇక్కడ కరోనా వైరస్ తొలి కేసు డిసెంబర్ ఆరంభంలో నిర్ధారణ అయింది.
అప్పటినుంచి కరోనావైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 280 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయిందని అంచనా. జపాన్ ఆ నష్టం నుండి మినహాయింపు పొందలేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇది రెండవ అత్యధిక కరోనా వైరస్ కేసులు కలిగిన దేశం. చైనా తరువాత రష్యాలోనే ముందుగా కరోనా వైరస్ ఉద్భవించింది.
ఒలింపిక్స్ గేమ్స్ షెడ్యూల్ ప్రకారమే జరగాలని ప్రకటించిన నాలుగు రోజుల తరువాత.. టోక్యో మారథాన్ ను అధికారులు రద్దు చేశారు. ఎలైట్ రన్నర్స్ అని పిలవబడే వారిని మాత్రమే పాల్గొనడానికి వీలు కల్పించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడైన డిక్ పౌండ్, ఒలింపిక్స్ కోసం షెడ్యూల్ ప్రారంభించినప్పటికీ ఐఓసి పర్యవేక్షణలో అలా చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఒలింపిక్స్ తరలిస్తే మాత్రం.. అది సమయ మార్పు కాదు.. స్థాన మార్పు కావచ్చు. క్రీడా పరిశ్రమ ప్రొఫెసర్ సైమన్ చాడ్విక్ 2020 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అడుగుజాడలను అనుసరించాలని, కొన్ని పొరుగు దేశాలలో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని సూచించారు.
అయితే, నివేదికలో గుర్తించినట్లుగా.. ఐఓసి, స్పాన్సర్‌లు రెండూ ఈ స్థలాన్ని మార్చడాటానికి విముఖత వ్యక్తం చేసింది. ఎందుకంటే.. ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడానికి ఇప్పటికే 25 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ ఖర్చు చేయడంతో మరింత ఆందోళనలను పెంచుతోంది.