పాప్ కార్న్ లా కనిపిస్తున్న సూర్యుడు

భగభగ మండే సూర్యుడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పాప్ కార్న్ ఉడుకుతున్న కుండలా కనబడుతున్నాడు. సూర్యుడి ఉపరితల భాగానికి సంబంధించిన ఫొటోలు తీశారు. హవాయ్ లోని ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ ఘనత సాధించారు.
సోలార్ టెలీస్కోప్ ద్వారా సూర్యుని ఉపరితల భాగాల ఫొటోలు తీశారు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ విడుదల చేసింది. అందులో ప్లాస్మా స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి ఉపరితల భాగాన్ని ఫొటోలు తీయడానికి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 13 అడుగుల సోలార్ టెలిస్కోప్ ను ఉపయోగించారు.
2013, డిసెంబర్ నుంచి సూర్యుడి ఫొటోలు తీసేందుకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రయత్నాలు చేపట్టింది. ప్రపంచంలో సూర్యుడి ఉపరితల భాగాన్ని ఫొటోలు తీయడం మొదటిసారి.
2012లో ఐరోపాలో అతి పెద్ద సోలార్ టెలీస్కోప్ ( GREGOR) అధ్యయనం చేపట్టింది. 2018లో ప్రారంభమైంది. టెలీస్కోప్ ఆఫ్టిక్స్, కంట్రోల్ సిస్టం, కొత్త కొత్త విధానాలు అమలు చేయడం ప్రారంభించారు. టెలీస్కోప్ ద్వారా సూర్యుడిపై 30 మైళ్ల దూరంలో ఎలాంటి విశేషాలు ఉన్నాయో చూసే అవకాశం ఉంది.
గెలీలియో కాలం నుంచి సూర్యుడిపై అధ్యయనానికి మానవాళి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో గొప్ప ముందడుగని హవాయిలోని మనోయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ జెఫ్ కుహ్ వెల్లడించారు.
అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో ఈ భారీ టెలిస్కోప్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఐఎఫ్ఏకు చెందిన శాస్త్రవేత్తల బృందం రెండు సంక్లిష్టమైన పరారుణ పరికరాలను నిర్మించింది. ఇది సూర్యుని అయస్కాంత కార్యకలాపాలు, సౌర తుఫానులను అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది.