అమెరికాలో 1000కి చేరిన కరోనా కేసులు

అమెరికాలో 1000కి చేరిన కరోనా కేసులు

Updated On : March 11, 2020 / 3:56 PM IST

కరోనా కేసులు అగ్ర దేశమైన అమెరికాలో వేగవంతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి 30మంది చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నా.. బుధవారానికి కరోనా పాజిటివ్ కేసులు 1000కి చేరినట్లు సమాచారం. వాషింగ్టన్ ప్రాంతంలోనే ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే 273మంది పేషెంట్లు ఉండగా 24మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాలిఫోర్నియా, న్యూయార్క్ నగరాల్లో 100కేసులకు పైగా నమోదయ్యాయి. మస్సాచుసెట్స్ Massachusetts ప్రాంతంలోనూ దాదాపు 92కు చేరింది కరోనా బాధితుల సంఖ్య. కరోనా వ్యాప్తి వాతావరణం బట్టి మారుతుంది. అక్కడి పరిస్థితులను బట్టి వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గే కొలదీ కరోనా సంక్రమించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 

వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో అమెరికా ఇప్పటికే పలు యూనివర్సిటీలు, సాధారణ మీటింగ్ లు క్యాన్సిల్ చేసింది. స్టూడెంట్స్‌కు సైతం ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ వర్శిటీ వచ్చే వారం నుంచు సెమిస్టర్ కు సంబంధించి అన్ని స్పీచ్ లు, సెమినార్లు,కోర్సులు ఇలా అన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది. 

ఏప్రిల్  వరకూ ఇదే కొనసాగుతుందని తెలిపింది. తరువాత పరిస్థితిని బట్టి ఆన్ లైన్ టీచింగ్‌ను కొనసాగించాలా? వద్దా అనే విషయంపై ఆలోచిస్తామని తెలిపింది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాంటాక్లారా కౌంటీలోని స్టాన్ఫోర్ట్ వర్శిటీ లో డజన్ల కొద్దీ కరోనా వైరస్ సోకిన పలు కేసులు నమోదయ్యాయి.  దీంతో ఈ సీజన్ లో లాస్ట్ సెమిష్టర్ రెండు వారాలపాటు క్లాసులను రద్దు చేసింది.