Hyderabad Students: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు మృతి

గత నెలలో నార్త్‌వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీలో చదువున్న సాహితీ అనే భార విద్యార్థి అమెరికాలోని హైవే 71లో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్‌లోని మొజాయిక్ లైఫ్ కేర్‌కు తరలించారు.

Hyderabad Students: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీ విద్యార్థులు మృతి

Updated On : April 27, 2023 / 9:19 AM IST

Hyderabad Students: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‭కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కెంటుకీలోని జాన్‭బర్గ్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన ఆ ఇద్దరు విద్యార్థులు మాస్టర్స్ చదువుతున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాదంలో మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. చనిపోయిన విద్యార్థుల పేర్లు మహ్మద్ ఫైజల్, ఇషాముద్దీన్ అని గుర్తించారు. ప్రమాదం జరగిన వెంటనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాయపడ్డ మూడో విద్యార్థికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. ప్రార్థనలు నిర్వహించి, ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.

Telangana Tourism : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ

ఇక గత నెలలో నార్త్‌వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీలో చదువున్న సాహితీ అనే భార విద్యార్థి అమెరికాలోని హైవే 71లో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్‌లోని మొజాయిక్ లైఫ్ కేర్‌కు తరలించారు. గర్భాశయ వెన్నెముక బాగా దెబ్బతిన్నదనమే కాకుండా అనేక గాయాలు అయ్యాయి. మరో దురదృష్టకర సంఘటనలో న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాలా అనే 39 ఏళ్ల వ్యక్తి ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో ఇంటర్-సిటీ రైలు ఢీకొని మరణించాడు.

Mango Farming : మామిడి తోటలకు ఆలస్యంగా పూత, కాత.. కాయలు నిలిచేందుకు శాస్త్రవేత్తల సూచనలు