Multi millionaire-sweeper : వీధులు ఊడ్చే వ్యక్తికి రూ.1.9 కోట్లు ఇచ్చి..10 ఏళ్లకు డబ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన మల్టిమిలియనీర్
వీధులు ఊడ్చే వ్యక్తికి రూ.1.9 కోట్లు ఇచ్చి 10 ఏళ్లకు డబ్బులు ఇవ్వాలంటూ కోర్టుకెక్కాడు ఓ మల్టిమిలియనీర్. కోర్టు కూడా అతని వద్ద తీసుకున్న డబ్బు చెల్లించాలని తీర్పు కూడా ఇచ్చింది.

Uk Multi Millionaire Street Sweeper Friend Rs 1.9 Crore,wins Court Case
UK Multi-millionaire street sweeper friend Rs 1.9 crore,wins court case : పేదలకు డబ్బులిస్తే అది జాలితోనో లేక మానవత్వంతోనో ఇస్తాం.అదే ఓ పేద స్నేహితుడికి డబ్బు సహాయం చేస్తే కష్టంలో ఉన్నాడని స్నేహం కొద్దీ ఇస్తాం. కానీ మిలియనియర్ మాత్రం ఓ పేదవాడికి డబ్బులిచ్చి కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి నా డబ్బులు నాకిచ్చేయమని అడిగాడు. పైగా అతను సాధారణ మిలియనియర్ కాదు మల్టీ మిలియనియర్. వీధులు ఈడ్చి శుభ్రం చేసే వ్యక్తితో స్నేహం చేశాడు ఆ మల్టీ మిలియనియర్. అది అతని గొప్పతనం అనుకోవాలి. అతను కష్టంలో ఉండటం చూసి రూ.1.9 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇది అతని గొప్ప మనస్సుకు మరో ఉదాహరణ అనుకోవాలి. కానీ అదే పేద స్నేహితుడికి ఇచ్చిన డబ్బుల్ని తను ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేమని డిమాండ్ చేస్తూ ఏకంగా కోర్టుకెక్కాడు సదరు మల్టీమిలియనియర్. అంతేకాదు కోర్టులో కేసు కూడా గెలిచాడు. ఇక ఆ పేద స్నేహితుడి నుంచి డబ్బులు వసూలు చేయటమే పనిలో ఉన్నారు. దీన్ని ఏమనాలి? స్నేహం పేరుతో చేసిన దగా అనాలా? లేదా డబ్బులున్నవారి (కొంతమంది) బుద్ధే అంత అనుకోవాలా? ఇంతకీ ఓ మల్టీ మిలియనియర్ కు వీధులు ఊడ్చే వ్యక్తితో స్నేహం ఎలా ఏర్పడింది?అంత డబ్బు ఇవ్వటానికి గల కారణాలేంటో తెలుసుకోవాలనిపిస్తోంది కదూ..
బ్రిటన్‌కు చెందిన జాన్ రాంకిన్ కార్న్‌ఫోర్త్ అనే వ్యక్తి.. 1979లో ఓ న్యూఇయర్ పార్టీలో సిమోన్ డెనియర్ అనే వ్యక్తిని అలా వారి మధ్య అయిన పరిచయం స్నేహంగా మారింది. పేద కుటుంబానికి చెందిన డెనియర్ వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జాన్ రాంకిన్.. డెనియర్ కలిసినప్పుడల్లా ఎన్నో మాట్లాడుకునేవారు. ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకునేవారు. అలా మద్యం తాగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు.అలా కొన్ని రోజులు గడిచాయి.జాన్ రాంకిన్ తన తండ్రి మరణానంతరం కొన్ని మిలియన్ల పౌండ్లు పొందారు. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్ల డబ్బుని తన నిరుపేద స్నేహితుడైన సిమోన్ డెనియర్‌కు 2012 నుంచి 2014 మధ్య మూడు దఫాలుగా ఇచ్చారు. వాటిని డెనియర్ తన అవసరాలకు వాడుకున్నారు. అలా డెనియర్ విడాకుల ఖర్చు కోసం 2012లో 26,300 పౌండ్లు, భార్యకు భరణం ఇచ్చేందుకు 2013లో 50వేల పౌండ్లు, ఇంటి అప్పు చెల్లించటానికి 2014లో 1.25 లక్షల పౌండ్లు ఇచ్చారు జాన్ రాంకిన్. అలా రాంకిస్ ఇవ్వటం..డెనియర్ తీసుకోవటం జరిగింది.
కానీ తను పేదవాడు కావటం వల్ల ..తమ మధ్య ఉన్న స్నేహం వల్ల..తనకు రాంకిన్ డబ్బులిస్తున్నాడని డెనియర్ అనుకున్నాడో ఏమో..కానీ రాంకిన్ మాత్రం తనకు డెనియర్ ఎప్పటికైనా తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడని ఆశించాడు. కానీ డెనియర్ మాత్రం ఎప్పుడు ఆ డబ్బుల విషయం తీసుకురాలేదు. దీంతో రాంకిన్ పేద స్నేహితుడిని తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగాడో లేదో గానీ..తన డబ్బులు తనకు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కాడు. దానికి రాంకిన్ ఒక్కటే చెబుతున్నాడు. నా స్నేహితుడు తను ఎప్పటికైనా తిరిగి ఇస్తాడని ఆశించాను కానీ ఎంతకు ఇవ్వకపోవటంతో కోర్టుకెక్కాను అని తెలిపాడు. అలా వదిలేయటానికి చిన్నమొత్తం కాదు కదా..చాలా పెద్ద మొత్తం అని చెప్పుకొచ్చారు.
తన స్నేహితుడు ఆర్థికంగా ఎదిగాక తన సొమ్మును తిరిగి చెల్లిస్తాడని భావించానని..కానీ అలా జరగలేదన్నారు. 2 లక్షల పౌండ్లు అనేది తనకు అంత పెద్ద సొమ్ము కాదని కోర్టు చెప్పినట్లు జాన్ రాంకిన్ గుర్తు చేసుకున్నారు. కానీ తన స్నేహితుడు తిరిగి ఇస్తాడని నమ్మానని.. అందుకే కోర్టు సాయం కోరానని తెలిపారు.మరోవైపు.. ఇంటి రుణం తీర్చేందుకని ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు తన స్నేహితుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని చెప్పాడు డెనియర్ చెప్పుకొచ్చాడు. తన మాజీ భార్యకు భరణం ఇచ్చేందుకు తీసుకున్న డబ్బులు అప్పుగానే తీసుకున్నానని, వాటిని తిరిగి చెల్లించేశానని సిటీ కౌంటీ కోర్టులో ఒప్పుకున్నాడు. “వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించే డెనియర్‌కు ఆ డబ్బు పెద్ద మొత్తం. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు” అని డెనియర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి స్టిఫెన్ హెల్‌మ్యాన్.. ఇంటి కోసం ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు సైతం రుణమేనని, తిరిగి చెల్లించాల్సిందేనిని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, అయితే.. విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.