టైమొచ్చింది: భారత్‌కు రానున్న ట్రంప్

టైమొచ్చింది: భారత్‌కు రానున్న ట్రంప్

Updated On : January 14, 2020 / 12:06 PM IST

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్‌ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట. ఈ మేరకే ట్రంప్ సెక్యూరిటీ విభాగం కశ్మీర్ లోనూ పర్యటించనున్న ప్రదేశాల్లోనూ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. 

ఆర్టికల్ 370 ఆమోదం అయినప్పటి నుంచి కశ్మీర్ లో పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు లేవు. భారత్.. అమెరికాల మధ్య వ్యాపార సంబంధమైన ఒప్పందం 2018లోనే కుదరాల్సి ఉంది. అది క్యాన్సిల్ అవడంతో ట్రంప్ దానిని పునరిద్ధరిస్తారని భారత్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. Generalized System of Preference (GSP) హోదా గురించి ఒప్పందమే అసలు ఆలోచన. 

ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్ భారత్ రావాలనుకోవడం మరొక కారణం. ప్రధాని మోడీ 2017 జూన్ లో అమెరికాలో పర్యటించినప్పుడే ట్రంప్ ను రావాలనుకుంటూ కోరాడు. ఆ తర్వాత మరోసారి 2019 రిపబ్లిక్ పరేడ్ కు రావాలంటూ మరో సారి ఆహ్వానం పంపింది భారత గవర్నమెంట్. 

భారత్‌లో చివరిసారిగా అడుగుపెట్టిన అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. 2015లో భారత రిపబ్లిక్ పరేడ్ కు హాజరై.. ఈ కార్యక్రమానికి వచ్చిన తొలి అమెరికా ప్రెసిడెంట్‌గా నిలిచాడు.