లాక్‌డౌన్‌లోనూ ఎలా వచ్చిందబ్బా..!..జూలో 8 గొరిల్లాలకు కరోనా..

US : San diego Zoo 8 gorillas test positive corona : యూఎస్ లోనే శాండియాగోలోని సఫారీ పార్కులో సందర్శకులను వినోదాన్ని పంచే గొరిల్లాలకు కరోనా మహమ్మారి సోకింది. కరోనాను నియంత్రించటనాకి విధించిన లాక్ డౌన్ లో సమయంలో కూడా పాపం గొరిల్లాలకు మహమ్మారి సోకటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూ నిర్వాహకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
శాండియాగోలోని సఫారీ పార్కులో ఉన్న 8 గొరిల్లాలకు కరోనా సోకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత డిసెంబర్ 6వ తేదీ నుంచి కాలిఫోర్నియాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో సఫారీ పార్క్‌ను కూడా మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. అయినప్పటికీ గొరిల్లాలకు కరోనా వైరస్ ఎలా సోకిందన్నది అధికారులకు అంతుబట్టకుండా ఉంది.
అయితే, సిబ్బంది ద్వారానే వాటికి అది సోకి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. గొరిల్లాలకు దగ్గరగా పనిచేసే జూ సిబ్బంది వరకు ఇటీవల కరోనా బారినపడ్డారు. బహుశా ఆయన ద్వారానే ఈ మహమ్మారి వాటికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. గొరిల్లాలకు కరోనా సోకడం ప్రపంచంలోనే ఇది తొలిసారని జంతు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయంపై పార్కుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ మాట్లాడుతూ..పార్కులో కలిసి నివసించే ఎనిమిది గొరిల్లాలకు ఈ వైరస్ సోకిందనీ..దీంతో గొరిల్లాలు దగ్గుతో బాధపడుతున్నాయని తెలిపారు. పశువుల నిపుణులు కరోనా సోకిన గొరిల్లాలను పరీక్షిస్తున్నారని వాటికి ఇమ్యూనిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వైల్డ్‌లైఫ్ కేర్ టీం సభ్యుడి నుంచి ఈ కరోనా ఇన్‌ఫెక్షన్ గొరిల్లాలకు సోకి ఉంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు. కాగా..కరోనావైరస్ కేసులను అరికట్టడానికి కాలిఫోర్నియా రాష్ట్రం లాక్డౌన్ ప్రయత్నాల్లో భాగంగా డిసెంబర్ 6 నుండి ఈ పార్క్ ప్రజలకు మూసివేసి విషయం తెలిసిందే. అయినా సరే సఫారీ పార్కులో గొరిల్లాలకు కరోనా సోకటం చర్చనీయాంశంగా మారింది.