Snake : వైరల్ వీడియో.. సిగ్గు విడిచి వెంటపడిన సర్పం

పాము ఏంటి? సిగ్గు విడవడం ఏంటి? అసలు పాములు సిగ్గు పడతాయా? అనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పలేదు. నిజానికి సిగ్గు పడే పాములు ఉన్నాయి. అవే సముద్రపు పాములు.

Snake : వైరల్ వీడియో.. సిగ్గు విడిచి వెంటపడిన సర్పం

Snake

Updated On : September 2, 2021 / 8:11 PM IST

Snake : పాము ఏంటి? సిగ్గు విడవడం ఏంటి? అసలు పాములు సిగ్గు పడతాయా? అనే సందేహం వచ్చింది కదూ. అలాంటి సందేహం రావడంలో తప్పలేదు. నిజానికి సిగ్గు పడే పాములు ఉన్నాయి. అవే సముద్రపు పాములు. సాధారణంగా అవి మనిషికి కనిపించకుండా తిరుగుతుంటాయి. అందుకే వాటిని ‘షై స్నేక్స్‌’ అని కూడా అంటారు. కానీ ఓ పాము మాత్రం తన సహజ స్వభావానికి భిన్నంగా వ్యవహరించింది. సిగ్గు విడిచి మనిషి వెంట పడింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

ఆస్ట్రేలియన్‌ యూట్యూబర్‌ బ్రాడీ మోస్‌.. ‘ప్యాడెల్‌ బోర్డింగ్‌’కు వెళ్లాడు. అదే సమయంలో ఓ సముద్రపు పాము నీళ్లలో ఈదుకుంటూ అతడిని వెంబడించింది. అంతేకాదు అతి దగ్గరగా వచ్చి.. ఆ ప్యాడెల్‌ బోట్‌ మీద కొంత సమయం తలను ఉంచింది. కాసేపటికే మళ్లీ ఈదుకుంటూ వెళ్లిపోయింది. బ్రాడీ మోస్ దీన్ని వీడియో తీశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. సిగ్గు పాములుగా పేరున్న సముద్ర సర్పం.. ఇలా స్వభావానికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తించిందనే దానిపై చర్చ మొదలైంది.

World Safest City: ప్ర‌పంచంలో సుర‌క్షిత‌మైన న‌గ‌రం కోపెన్ హాగెన్..ఎందుకంటే..

మామూలు టైంలో సముద్రపు పాముల కదలిక చాలా రహస్యంగా ఉంటుంది. అయితే లైంగిక కోరికలు రేకెత్తినప్పుడు మాత్రం.. జంట కోసం వెతుకుంటూ బయటకు వస్తాయి. ఆ టైంలో అవి చురుకుగా ఉంటాయని, బహుశా అందుకే ఆ పాము అలా ప్రవర్తించి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.