పచ్చని కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు

అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు
అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు జరుగుతాయి. పచ్చని సంసారాలు నాశనం అవుతాయి. పిల్లలు అనాథలుగా మారతారు. మనుషులు క్రిమినల్స్ అవుతారు, జైలు పాలవుతారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అక్రమ సంబంధాలు వద్దని పోలీసులు నెత్తీ నోరు బాదుకుని చెబుతున్నారు. అయినా ఇంకా మార్పు రావడం లేదు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త సుఖాలు వెతుక్కుంటున్నారు. చివరికి చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. అనైకి బంధం గురించి ప్రశ్నించిన భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కూడ్లు సమీపంలో ఆదివారం(మే 17,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. ఏఎఫ్‌సీఎల్ లేఔట్‌లో బీహార్‌కు చెందిన మనీష్ కుమార్(38), సంధ్యా(33) దంపతులు రెండేళ్ల క్రితం బెంగళూరు వచ్చి ఎఫ్‌సీఎల్ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు. మనీష్‌కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
మరో మహిళతో భర్త అఫైర్:
ఈ విషయం భార్యకు తెలిసింది. భర్తను నిలదీసింది. పద్ధతి మార్చుకోవాలని చెప్పింది. ఈ విషయమై దంపతులు నిత్యం గొడవపడేవారు. ఎంత చెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో తన భర్త వ్యవహారాన్ని సంధ్య తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో మనీష్ కోపంతో ఊగిపోయాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న మనీష్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. రెండు రోజులుగా కూతురి నుంచి ఫోన్ రాకపోవడంతో సంధ్య తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఏం జరిగిందో అని భయపడ్డారు. వారు ఆదివారం నగరానికి వచ్చారు.
భార్యను చంపి భర్త సూసైడ్:
అత్తమామలు ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మనీష్ భయపడ్డాడు. తాను చేసిన నేరం బయటపడిపోతుందని ఆందోళన చెందాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇంట్లో సంధ్య మృతదేహం, బయట మనీష్ మృతదేహం కనిపించాయి. దీంతో వారు షాక్ తిన్నారు. ఇటు కూతురిని అటు అల్లుడిని విగతజీవులుగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. రంగంలోకి దిగిన పరప్పన అగ్రహార పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Here>> టిక్ టాక్ లో పరిచయం, ఆపై అత్యాచారం.. హైదరాబాద్ పాతబస్తీలో దారుణం