Supreme Court: భర్త వీలునామా అలా రాస్తే ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు
భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు ఉండే హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త పరిమితులతో కూడిన వీలునామా రాస్తే ఆ ఆస్తిపై పూర్తి హక్కులు ఆమెకు ఉండవని వ్యాఖ్యానించింది.

Wife Does Not Have Full Rights Over The Husbands Property
wife does not have full rights over the husbands property : భర్త సంపాదించిన ఆస్తి ఆయన మరణానంతరం భార్యకే దక్కుతుంది. కానీ సదరు వ్యక్తి రెండో వివాహం చేసుకుంటే..ఆ ఆస్తి దక్కే విషయంలో పలు అనుమానాలు..పలు వివాదాలు తలెత్తుతుంటాయి. ఆస్తి హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు లబ్దిదారులు. ఎందుకంటే చర స్థిరాస్తుల విషయంలో చట్టపరంగా ఎన్నో కీలక విషయాలు ఉంటాయి. అదే సదరు వ్యక్తి రాసిన వీలునామాలను బట్టి ఆస్తి హక్కులు ఉంటుంటారు. అలా ఓ భర్త రాసిన ఆయన భార్యకు దక్కే విషయంలో సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది.
ఆస్తి హక్కుల కోసం సుప్రీంకోర్టుకు రాగా ఈ కేసు విషయంలో భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సంక్రమించే హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హర్యానాకు చెందిన తులసీరామ్ కేసులో భర్త కనుక పరిమితులతో కూడిన వీలునామా రాస్తే దానిపై పూర్తి హక్కులు ఆమెకు సంక్రమించబోవని ధర్మాసనం సుస్పష్టం చేసింది. కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తులసీరామ్ తన మొదటి భార్య చనిపోవడంతో రామ్ దేవి అనే మహిళను వివాహం చేసుకుని రెండో భార్యగా చేసుకున్నాడు. ఆతరువాత తులసీరామ్ 1969లో మృతి చెందారు. రామ్‌దేవి, కుమారుడికి తన ఆస్తి చెందేలా 1968లో వీలునామా రాశారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఆమె జీవించవచ్చని వీలునామాలో పేర్కొన్నారు. భార్య మరణణం తరువాత ఆ ఆస్తి మొత్తం తన కుమారుడికే చెందాలంటూ కొన్ని పరిమితులు విధించారు. తులసీరామ్ 1969లో మృతి చెందడంతో కొందరు వ్యక్తులు ఆ ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ ఆస్తికి సంబంధించి వివాదానికి కారణమైంది. ఆ వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది.
Aldo read : ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు
ఈ కేసుపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం (ఫిబ్రవరి 1,2022) దీనిపై విచారణ చేపట్టింది. వారి వారి తరపు న్యాయవాదులు వాదనలు విన్న అనంతరం..సుప్రీంకోర్టు హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల కోసం ఏర్పాట్లు చేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య.. జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాస్తే కనుక సంబంధిత ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు సంక్రమించబోవని స్పష్టం చేసింది. రామ్‌దేవి నుంచి ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్‌లను కొనసాగించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.దీంతో ఆస్తిపై సదరు ఆశావహులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.