అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం: క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగ్..

  • Published By: sekhar ,Published On : October 16, 2020 / 01:38 PM IST
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం: క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగ్..

Updated On : October 16, 2020 / 2:11 PM IST

Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అక్కినేని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అటువంటిది ఏం లేదు అంటున్నా కూడా కథనాలు ఆగకపోవడంతో తాజాగా కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.


‘‘అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. తప్పుడు వార్తలు బాధ పడాల్సిన అవసరం లేదు అంతా బాగానే వుంది..’’ అంటూ నాగ్ ట్వీట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.