Baby Mega Cult Celebrations : బేబి ‘మెగా’ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి.. ఎప్పుడంటే..?
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించారు.

Mega Cult Celebrations
Baby Movie Mega Cult Celebration : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించిన ఈ చిత్రానికి సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే దాదాపుగా రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
Brahmanandam : బ్రహ్మానందం ఇంట మొదలైన పెళ్లి సందడి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
చాలా మంది సినీ నటులు బేబీ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. సినిమా సక్సెస్ ఈవెంట్‌కు సైతం హాజరుఅయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా మెగాకల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో చిత్ర బృందం ఓ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఇక ఈ వెంట్‌కు డేట్, టైమ్ కూడా ఫిక్స్ చేశారు.
రేపు(జూలై 30న) మెగాకల్ట్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాత శ్రీనివాస కుమార్ తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నుంచి ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు తెలిపారు. అయితే.. ఈ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు అన్నది మాత్రం ఆయన చెప్పలేదు.
Rajinikanth : కావ్య బాధపడుతుంటే చూడలేకపోతున్నా.. మారన్ వెంటనే ఈ పని చేయండి
The Cult Blockbuster #BabyTheMovie is all set to receive a
MEGA APPRECIATION ??Mega Cult Celebrations tomorrow at 6PM.
To be graced by one & only MEGASTAR @KChiruTweets garu@ananddeverkonda @iamvaishnavi04 @viraj_ashwin @sairazesh @VijaiBulganin @MassMovieMakers… pic.twitter.com/f64VP3GDDt
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 29, 2023
ఇంటికి పిలిపించుకుని అభినందించిన చిరంజీవి
బేబీ సినిమా చూసిన చిరంజీవి చిత్ర దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్‌కేఎన్‌ను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్‌తో పాటు నిర్మాత ఎస్‌కేఎన్ తమ సోషల్ మీడియా వేదికల్లో చిరును కలిసిన ఫోటోలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బేబీ సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఎంతగానో నచ్చిందన్నారు. సినిమాకు పని చేసిన ప్రతి డిపార్టుమెంట్‌ను ఆయన అభినందించారని వారు తెలిపారు.