Daaku Maharaaj : చరణ్ బాటలో బాలయ్య.. ఆ దేశంలో డాకు మహారాజ్ ఈవెంట్.. జై బాలయ్య మారు మోగిపోద్ది..

గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి వస్తుండగా బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది.

Daaku Maharaaj : చరణ్ బాటలో బాలయ్య.. ఆ దేశంలో డాకు మహారాజ్ ఈవెంట్.. జై బాలయ్య మారు మోగిపోద్ది..

Balakrishna Daaku Maharaaj Special Event Planned in America

Updated On : November 23, 2024 / 7:59 PM IST

Daaku Maharaaj : ఇటీవల మన సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన సినిమాలు ఓవర్సీస్ లో కూడా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఇటీవలే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అమెరికాలో జరగబోయే మొదటి ఇండియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గేమ్ ఛేంజర్ నిలవనుంది. అయితే బాలయ్య కూడా ఇదే బాటలో చేరాడు.

Also Read : Allu Arjun – Balakrishna : బాలయ్య షోలో కలిసి సందడి చేసిన అల్లు అర్జున్, అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..

గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాతికి వస్తుండగా బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఈవెంట్ ని అమెరికాలో నిర్వహించబోతున్నట్టు ప్రకరటించారు. జనవరి 4వ తారీకు సాయంత్రం అమెరికాలోని డల్లాస్ లో డాకు మహారాజ్ ఈవెంట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య కూడా హాజరుకాబోతున్నటు సమాచారం.

Image

డల్లాస్ అంటేనే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేస్, అందులోను అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. గతంలో అమెరికా నుంచి జై బాలయ్య స్లొగన్స్ తో వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా బాలయ్య ఈవెంట్ అమెరికాలో పెడుతుండటంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా జై బాలయ్య అని మారు మోగించడానికి రెడీ అయిపోతున్నారు. బాలయ్య బాబు ఈవెంట్ తో అమెరికాలో జై బాలయ్య అని దద్దరిల్లడం ఖాయం.