Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా జాతిరత్నమే.. బాలయ్య షోలో కూడా నవీన్ అల్లరి..

బాలయ్య - శ్రీలీల - నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు ఈ ఎపిసోడ్ కోసం.

Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా జాతిరత్నమే.. బాలయ్య షోలో కూడా నవీన్ అల్లరి..

Balakrishna Sreeleela Naveen Polishetty Aha Unstoppable Episode Funny Photo Shared

Updated On : November 27, 2024 / 5:34 PM IST

Naveen Polishetty : ఆహా ఓటీటీలో బాలయ్య అన్ స్టాపబుల్ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజన్ 4లో 5 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇటీవల శ్రీలీల, నవీన్ పోలిశెట్టి తో బాలయ్య షో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ శ్రీలీల, ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన నవీన్ ఈ షోకి రావడంతో ఈ ఎపిసోడ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Allu Arjun – Rashmika : విమానంలో పుష్ప – శ్రీవల్లి సందడి.. రష్మిక చేతికి ఏమైంది..?

బాలయ్య – శ్రీలీల – నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు ఈ ఎపిసోడ్ కోసం. తాజాగా ఆహా టీమ్ ఈ షో నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసింది. బాలకృష్ణ శ్రీలీలకు ఏదో బహుమతి ఇస్తుంటే నవీన్ కూడా తీసుకుంటున్నట్టు దూరంగా నిల్చొని చెయ్యి పెట్టాడు. ఈ ఫోటో చూడగానే జాతిరత్నాలు సినిమాలో బర్త్ డే సీన్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో బర్త్ డే సీన్ లో నవీన్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఎవరో గిఫ్ట్ ఇస్తుంటే ఇలాగే చెయ్యి పెడతారు. ఆ సీన్ తో కంపేర్ చేస్తూ ఆహా టీమ్ ఈ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

Image

సినిమాల్లోనే కాదు బయట కూడా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే నవీన్ పోలిశెట్టి ఇప్పుడు బాలయ్య ముందు కూడా తన ఎనర్జీని చూపించినట్టు తెలుస్తుంది. ఈ ఒక్క ఫోటో చాలు బాలయ్య – నవీన్ – శ్రీలీల ఎపిసోడ్ ఏ రేంజ్ లో వచ్చిందో చెప్పడానికి. ఒక యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు కొంచెంగ్యాప్ ఇచ్చిన నవీన్ ఇప్పుడు బాలయ్య షోతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.