Dulquer Salmaan : తన లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్.. స్కూల్ జూనియర్ కి ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టి..
దుల్కర్ సల్మాన్ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు.

Dulquer Salmaan Revealed his Love Story in Balakrishna Unstoppable Show
Dulquer Salmaan : బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో ఇటీవల మొదలయింది. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు నాయుడు రాగా తాజాగా నేడు రెండో ఎపిసోడ్ రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ టీమ్ దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, నాగవంశీ, మీనాక్షి చౌదరి గెస్టులుగా వచ్చారు.
ఈ షోలో దుల్కర్ సల్మాన్ తన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. దుల్కర్ అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Game Changer : లుంగీ కట్టిన రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ టీజర్ ఎప్పుడో తెలుసా.. కొత్త పోస్టర్ రిలీజ్..
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తను నా స్కూల్ జూనియర్. నేను 12వ తరగతిలో ఉన్నప్పుడు తను 8వ తరగతి. అప్పుడు అంతగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్స్ లో కనపడేది. మాములుగా తెలిసినా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం కాదు, జస్ట్ పరిచయం అంతే. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు నేనే తన ఫేస్ బుక్ లో మెసేజ్ చేశాను. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మీ ఇంట్లో కూడా చూస్తుంటారు మనం ఒకసారి కలిసి ఎందుకు మాట్లాడుకోకూడదు అని కలిసాము. కలిసి మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పటికి మా పెళ్లయి 13 ఏళ్ళు అయింది అని తెలిపారు.