పాపులర్ నటికి కరోనా పాజిటివ్..

దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా హిందీ టీవీ నటి అదితి గుప్తా కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అదితి గుప్తా పలు టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. స్టార్‌ప్లస్‌లో ప్రసారమవుతున్న పాపులర్ షో Ishqbaaaz లో కూడా కనిపించిందామె. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని అదితి గుప్తా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.
కరోనా సోకినట్లు తెలియగానే, హోం క్వారంటైన్‌లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది. కరోనా వ్యాధి లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, ఏడు, ఎనిమిది రోజులుగా హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నానని, తన భర్త, కుటుంబ సభ్యులు తనకు ధైర్యం చెబుతున్నారని, ఇంకో 10 రోజులు హోం క్వారంటైన్‌లోనే ఉంటానని తెలిపింది. సనైన మందులు తీసుకుంటూ, పాజిటివ్ ధోరణితో ఉంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని, అందుకోసం ఎదురు చూస్తున్నానని పోస్ట్ చేసింది అదితి గుప్తా.