Yatra 2 : సీఎం జగన్ బయోపిక్ పై దర్శకుడు మహీ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, పవన్ కూడా!

సీఎం జగన్ బయోపిక్ గా యాత్ర 2 రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు మహీ వి రాఘవ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Yatra 2 : సీఎం జగన్ బయోపిక్ పై దర్శకుడు మహీ కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, పవన్ కూడా!

Mahi V Raghav comments on YS Jagan Mohan Reddy Yatra 2

Updated On : May 8, 2023 / 4:47 PM IST

Yatra 2 : మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితలోని ఒక అంశం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. 2019 ఎన్నికల సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మహీ వి రాఘవ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇక మూవీకి సీక్వెల్ తీసుకు వస్తామంటూ ఇటీవల ఈ దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితం ఆధారంగా యాత్ర 2 ఉండబోతుంది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.

Balakrishna : కేంద్రాన్ని అభ్యర్దిస్తున్నా, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలి.. శతజయంతి సభలో బాలకృష్ణ

కాగా ఈ సీక్వెల్ వచ్చే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల గురిగా రాబోతుంది, వైఎస్ జగన్ ని సపోర్ట్ చేసేలా సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీటి పై మహీ వి రాఘవ్‌ రియాక్ట్ అయ్యాడు. “సినిమా చూసి జనాలు ఓట్లు వేస్తారు అనుకుంటే ఇతర పార్టీ నాయకులు చంద్రబాబు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా బయోపిక్ లు తీసుకోవచ్చు. అయినా వైస్ కి ఓటు వేసిన వారంతా నా సినిమా చూసి ఉంటే బాహుబలిలా పెద్ద హిట్ అయ్యేది. సినిమాల వల్ల ఓట్లు పడతాయి అనేది కేవలం అపోహ మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు.

Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. అలాంటి రోల్‌లో నటిస్తుందా..?

అలాగే యాత్ర 2 కథ ఎలా ఉండబోతుందో కూడా తెలియజేశాడు. వైఎస్ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమా ఎండ్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. కథ ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉందని, నటించే నటులు విషయంలో కూడా సరైన వారి కోసం వెతుకుతున్నామని వెల్లడించాడు. కాగా ఈ బయోపిక్ లో జగన్ రోల్ ని తమిళ నటుడు జీవా నటించబోతుండటంటూ కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా ‘సైతాన్‌’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో జూన్ నెల ఎండ్ నుంచి యాత్ర 2 పనులు పూర్తి స్థాయిలో మొదలు కానున్నట్లు తెలుస్తుంది.