Manchu Vishnu : ఆయనకు నా వల్ల చెడ్డపేరు వస్తే నేను బతికున్నా చచ్చినా ఒకటే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవ్వనుంది.

Manchu Vishnu : ఆయనకు నా వల్ల చెడ్డపేరు వస్తే నేను బతికున్నా చచ్చినా ఒకటే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Manchu Vishnu Interesting Comments on his Father Mohan Babu in Kannappa Promotions

Updated On : May 21, 2025 / 9:07 AM IST

Manchu Vishnu : గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అంటూ ఈ వివాదాలు రోడ్డు మీదకు, మీడియా ముందుకు కూడా వచ్చాయి. ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్ రెగ్యులర్ గా మీడియా ముందు కౌంటర్లు వేయడం, ఇండైరెక్ట్ గా ఈ టాపిక్ గురించి మాట్లాడటం చేస్తున్నారు.

విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు విష్ణు.

Also Read : Sukumar : సొంతూళ్లో సుకుమార్.. రామ్ చరణ్ సినిమా, థియేటర్స్ సమస్య పై కామెంట్స్..

మంచు విష్ణు మాట్లాడుతూ.. ఇప్పుడు నా ఫోకస్ అంతా మా నాన్న గారు హ్యాపీగా ఉండాలి అంతే. ఆయన పడ్డ కష్టానికి నేను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు కానీ చెడ్డపేరు తీసుకురాకూడదు. ఆయనకి ఏ రోజైతే నేను చెడ్డ పేరు తీసుకొస్తానో ఒక కొడుకుగా నేను బ్రతికున్నా చచ్చినా ఒకటే. నేను బతికున్నంత వరకు మా నాన్నకు చెడ్డ పేరు తీసుకురాను. మా నాన్న లేకపోతే నేను లేను. మన అందరికి మన ఫాదర్స్ అంటే ఇష్టం. వాళ్ళు పడిన కష్టం, త్యాగాలు మనం తండ్రులం అయ్యాకే తెలుస్తుంది అని అన్నారు.

 

Also Read : ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు క్యూట్ పిల్లలు ఎవరో తెలుసా? ఒకరు స్టార్ హీరో.. ఇంకొకరు దర్శక నిర్మాత..