ఉద్యమ సింహం: కేసీఆర్ సినిమాకు సెన్సార్ షాక్‌లు
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఉద్యమసింహానికి సెన్సార్ షాకిచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను మూట గట్టుకున్న ఈ చిత్రం నిర్మాణ దశ పూర్తి చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఉద్యమసింహానికి సెన్సార్ షాకిచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను మూట గట్టుకున్న ఈ చిత్రం నిర్మాణ దశ పూర్తి చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఉద్యమసింహానికి సెన్సార్ షాకిచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలను మూట గట్టుకున్న ఈ చిత్రం నిర్మాణ దశ పూర్తి చేసుకుంది. ఇటీవల సెన్సార్ బోర్డుకు వెళ్లగా మార్పులు తప్పనిసరిగా మారాయి. గతేడాది నవంబరులోనే విడుదల కావలసిన ఈ చిత్రం అసెంబ్లీ ఎన్నికల కారణంగానే వాయిదా పడటంతో ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
ఈ క్రమంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెప్తూ సెన్సార్ బోర్డు సినిమా కాపీని తిప్పి పంపిందట. కీలకాంశాలుగా అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, దాంతో పాటు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ఫొటోలు, కాంగ్రెస్ కండువా పలు సందర్భాల్లో కనబడటంతో ఆ సీన్లను ఎడిట్ చేయాల్సిందేనంటూ బోర్డు తిరస్కరించిందట.
15రోజుల క్రితమే సెన్సార్ బోర్డుకు పంపిన యాజమాన్యానికి చుక్కెదురు కావడంతో మరోసారి ఎడిటింగ్ పనులు పూర్తి చేసుకుంది. సినిమాకు అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహించగా నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో నటించారు.
నటరాజన్ మాట్లాడుతూ.. ‘ఎడిటింగ్ పూర్తయిపోయింది. సెన్సార్ బోర్డుకు సోమవారం పంపనున్నాం. ఫిబ్రవరి 8వ తేదీకల్లా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ప్రీమియర్ షో చూస్తానని మాటిచ్చారని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లోపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై ఏర్పాటు గురించి ప్రయత్నిస్తున్నందున దీని సీక్వెల్ కూడా తీసే ఆలోచన ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.