Curry & Cyanide : అంతగా ఏముంది ఈ సిరీస్‌లో.. ‘కర్రీ & సైనేడ్’.. రెండు వారాలుగా 30 దేశాల్లో టాప్ 10 ప్లేస్‌లో..

ఇటీవల 'కర్రీ & సైనేడ్' అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్(Netflix). కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటనతో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు.

Curry & Cyanide : అంతగా ఏముంది ఈ సిరీస్‌లో.. ‘కర్రీ & సైనేడ్’.. రెండు వారాలుగా 30 దేశాల్లో టాప్ 10 ప్లేస్‌లో..

Netflix Curry & Cyanide : The Jolly Joseph Case Documentary Series Trending Top 10 over 30 countries globally

Updated On : January 6, 2024 / 10:49 AM IST

Curry & Cyanide : ఇటీవల అన్ని ఓటీటీల్లో మంచి మంచి సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో అయితే రెగ్యులర్ గా సిరీస్ లు వస్తుంటాయి. డాక్యుమెంటరీ సిరీస్ లు కూడా తీసుకొస్తున్నారు. ఇటీవల ‘కర్రీ & సైనేడ్’ అనే ఓ డాక్యుమెంటరీ సిరీస్ ని తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్(Netflix). కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటనతో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు.

అసలు ‘కర్రీ & సైనేడ్’ కథేంటి అంటే.. ఓ పెళ్ళైన జానీ అనే మహిళ తను విలాసవంతమైన జీవితం గడపాలి అనుకుంటుంది. కానీ దానికి అడ్డుపడుతున్న అత్తని తినే ఆహారంలో సైనైడ్ కలిపి చంపేస్తుంది. ఆ తర్వాత అనుమానిస్తున్నాడని భర్తని, ఆస్తి కోసం మామని, ఆ తర్వాత బాబాయ్ ని, స్నేహితురాలిని.. ఇలా ఆరుగురిని ఆహారంలో సైనైడ్ కలిపి చంపేసింది. అయితే ఇవన్నీ సాధారణ మరణాలుగా చిత్రీకరించి ఎవరికీ అనుమానం రాకుండా చేసింది. కానీ కొన్నాళ్ల తర్వాత జాలి ఆడపడుచుకి అనుమానం వచ్చి దీని గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారమిస్తుంది. దీంతో పోలీసులు ఆ జాలి అనే మహిళ కథని ఎలా క్లోజ్ చేశారు, ఆ కేసుని ఎలా ఛేదించారు అనేది క్లైమాక్స్.

Also Read : Ayalaan Trailer : ‘అయలాన్’ ట్రైలర్ చూశారా? ఏలియన్ ఇండియాకు వస్తే..?

థ్రిల్లింగ్ సిరీస్ గా తెరకెక్కిన ఈ ‘కర్రీ & సైనేడ్’ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది. డిసెంబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రిలీజయింది. విడుదల అయిన దగ్గర్నుంచి దాదాపు రెండు వారాలుగా 30 దేశాల్లో ఈ ‘కర్రీ & సైనేడ్’ సిరీస్ టాప్ 10 లోనే కొనసాగుతుంది. జనాలు విపరీతంగా ఈ సిరీస్ ని చూస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ ‘కర్రీ & సైనేడ్’ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు కూడా ఈ థ్రిల్లింగ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.