Pawan Kalyan : నా సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గిస్తారు.. వైసీపీపై ఫైర్ అయిన పవన్
తాజాగా పవన్ కళ్యాణ్ దీనిపై కూడా మాట్లాడుతూ.. ''నా సినిమాలు రిలీజయినప్పుడే మీకు ఫ్రెష్ గా ఐడియాలు వస్తాయి. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండొద్దా అంటూ టికెట్ రేట్లు తగ్గిస్తారు. నా సినిమా..............

Pawan Kalyan comments on movie ticket rates in ap
Pawan Kalyan : రెండు రోజుల క్రితం విశాఖ జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళితే ఆ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారంటూ దాదాపు 90 మందిని అరెస్ట్ చేశారు, పవన్ ని విశాఖ నుంచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. రెండు రోజులు విశాఖ వివాదాలమయంగా మారింది.
ఈ ఘటనతో ఏపీలో పరిస్థితులు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయ రణరంగంగా మారాయి. దీనిపై పవన్ సోమవారం నాడు విజయవాడ చేరుకొని ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రాజకీయాలతో పాటు సినిమాకి సంబంధించిన అంశం కూడా మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన సమయంలో టికెట్ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఇది కావాలనే వైసీపీ ప్రభుత్వం చేస్తుందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
Kanatara : అవేమి చేయలేని పని కాంతారా చేస్తోంది.. కాంతారా సినిమాపై ఆర్జీవీ ట్వీట్స్..
తాజాగా పవన్ కళ్యాణ్ దీనిపై కూడా మాట్లాడుతూ.. ”నా సినిమాలు రిలీజయినప్పుడే మీకు ఫ్రెష్ గా ఐడియాలు వస్తాయి. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండొద్దా అంటూ టికెట్ రేట్లు తగ్గిస్తారు. నా సినిమా పక్కకెళ్ళగానే మళ్ళీ టికెట్ రేట్లు పెరిగిపోతాయి. నా పుట్టినరోజు అన్నప్పుడే మీకు పర్యావరణం గుర్తొచ్చి బ్యానర్స్ ని బ్యాన్ చేస్తారు. మీరు ఇంకా ఎన్ని చేస్తారో చూస్తాను. ప్రతిదానికి సమాధానం ఉంటుంది” అని వైసీపీపై ఫైర్ అయ్యారు.