వ్యాక్సిన్ వచ్చేవరకు నో షూటింగ్… వెయిట్ చేయాల్సిందే…

  • Published By: sekhar ,Published On : July 25, 2020 / 04:27 PM IST
వ్యాక్సిన్ వచ్చేవరకు నో షూటింగ్… వెయిట్ చేయాల్సిందే…

Updated On : July 25, 2020 / 5:38 PM IST

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు చూసుకుంటూనే మూడు సినిమాలు కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో హరీష్ శంకర్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఇంకా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. మిగతా రెండు సినిమాలలో ఒకటైన ‘వకీల్‌సాబ్’ చిత్రం 70 శాతం షూటింగ్ జరుపుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రం అన్ని సిద్ధం చేసుకుని సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు షూటింగ్‌లకు అనుకూలంగా లేవు. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది.

Pawan Kalyan

సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక పవన్ కల్యాణ్ సినిమాల షూటింగ్స్ మళ్లీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ.. ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. దీనిపై జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Pawan Kalyan

ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా వల్ల షూటింగులన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్‌ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే..’’ అని తెలిపారు.