Ram Charan: ఆచార్యను దెబ్బకొట్టిన జక్కన్న.. అసలు విషయం ఏంటంటే?
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతోన్న చరణ్ పదిహేనో సినిమా సంగతలా ఉంటే.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనుకున్న ఆచార్య సంగతి మరోలా ఉంది. కేవలం చరణ్ ఉన్నాడన్న ఒక్క కారణంతో ఆచార్యను..

Ram Charan
Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవుతోన్న చరణ్ పదిహేనో సినిమా సంగతలా ఉంటే.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనుకున్న ఆచార్య సంగతి మరోలా ఉంది. కేవలం చరణ్ ఉన్నాడన్న ఒక్క కారణంతో ఆచార్యను నార్త్ ఆడియెన్స్ కు దూరం చేస్తున్నారు మేకర్స్. హిందీలో ఆచార్య రాదని చెప్పేస్తున్నారు. అసలు చరణ్ ఇమేజ్ కి, ఆచార్య రిలీజ్ కి సంబంధం ఏంటి.. ఆచార్యను రాజమౌళి ఎలా దెబ్బకొట్టాడు?
Ram Charan: చెర్రీ వేరియేషన్స్.. శంకర్ కోసం నాలుగు గెటప్స్?
ఆచార్యను దెబ్బతీశారు జక్కన్న. నార్త్ ఆడియెన్స్ ముందుకు చిరూ సినిమా వెళ్లకుండా చేశారు. అవును ఏప్రిల్ 29న ఆచార్య హిందీ వెర్షన్ రిలీజ్ ఉండదనే హింట్స్ అందుతున్నాయి. నిజానికి ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా వైడ్ ఆచార్య రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ ఆర్ఆర్ఆర్ వచ్చేసాక మారిన సీన్ తో తండ్రీకొడుకులు ఆచార్యను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తున్నారు.
Ram Charan: ముంబై థియేటర్లో చెర్రీ.. ప్రేక్షకులకు సడెన్ సర్పైజ్!
ఏప్రిల్ 29న తెలుగు లాంగ్వేజ్ లోనే ఆచార్య దాదాపు 15వందలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత వారానికి తమిళ్, కన్నడ వెర్షన్స్ లో కూడా ఆచార్య రిలీజ్ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే హిందీ వెర్షన్ ను మాత్రం మెగా హీరోలు వద్దనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా చరణ్ ను జక్కన్న ప్రమోట్ చేసిన తీరు.. హై ఎండ్ హీరోయిజంతో, పవర్ఫుల్ యాక్టింగ్ తో చరణ్ కొచ్చిన క్రేజ్.. ఇప్పుడు ఆచార్యకు అడ్డంకిగా మారింది.
Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పని చేసిన వారికి బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్
ఆచార్యలో లీడ్ రోల్ చిరంజీవిదే. తండ్రి కోసం చరణ్ బిగ్ సపోర్టింగ్ రోల్ చేశాడు. అయితే 30 నిమిషాలకు పైగానే చరణ్ కనిపిస్తాడని.. మల్టీస్టారర్ అనుకోవాలని కొరటాల శివ తేల్చేశాడు. ఎంత చెప్పినా.. ఆచార్య చిరూ సినిమాగానే ఫ్యాన్స్ భావిస్తారు. అటు చరణ్ కు ట్రాజెడీ ఎండ్ ఉంటుందనే టాక్ ఉంది. సో ట్రిపుల్ ఆర్ లో వచ్చిన హై లెవల్ ఇమేజ్ ను డామినేట్ చేసేలా చరణ్ నెక్ట్స్ సినిమా ఉండాలి కానీ.. నార్త్ ఆడియెన్స్ లో బజ్ తగ్గేలా ఉండకూడదు. ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా నార్త్ మార్కెట్ పై కన్నేసిన చరణ్.. అక్కడ నెక్ట్స్ సినిమానూ పవర్ ఫుల్ గానే ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆచార్యకు నార్త్ లో బ్రేక్ వేస్తున్నారు.