రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీకి మద్దతు ఇవ్వొద్దంటూ ఫ్యాన్స్ నినాదాలు!

  • Published By: sekhar ,Published On : November 30, 2020 / 12:07 PM IST
రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ పార్టీకి మద్దతు ఇవ్వొద్దంటూ ఫ్యాన్స్ నినాదాలు!

Updated On : November 30, 2020 / 1:56 PM IST

Rajinikanth: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఎప్పుడు?.. ఇటీవల తన ఆరోగ్యం సహకరించడం లేదంటూ షాకింగ్ వార్త చెప్పిన తలైవా, ఇప్పుడు రాజకీయ అరంగేట్రం విషయంలో స్పష్టత ఇవ్వనున్నారా?.. అంటే, అవును అనే మాట వినిపిస్తోంది.

Rajinikanthనవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో జరుగబోయే సమావేశానికి 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులు చెన్నైకి రావలసిందిగా రజినీ పిలుపునివ్వడంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠతకు తెర తీసింది.


ఈ సమావేశం అనంత‌రం ఆయ‌న త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే అంతకు ముందుగానే అభిమానులు ర‌జినీకాంత్ ఇంటికి చేరుకుని నినాదాలు చేపట్టారు. కొంత మంది అభిమానులు సూప‌ర్‌స్టార్‌కు షాకిచ్చారు.Rajinikanthబీజేపీకి వ్య‌తిరేకంగా కొంత‌మంది అభిమానులు నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మీ వెంటే ఉంటామని, బీజేపీకి స‌పోర్ట్ చేస్తే మాత్రం ఒప్పుకోమంటూ తేల్చి చెప్పేశారు. ర‌జినీ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.