ఈమె ముందు వాళ్ళు హీరోలు కాదు – హీరోయిన్లు
కంగనను మిగతా యాక్షన్ హీరోలతో కంపేర్ చేసి చూస్తే, ఆమె ముందు వాళ్ళంతా హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు.

కంగనను మిగతా యాక్షన్ హీరోలతో కంపేర్ చేసి చూస్తే, ఆమె ముందు వాళ్ళంతా హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ.. ఏ విషయంలో, ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతాడో, ట్విట్టర్‌ని వేదికగా చేసుకుని ఎవరి తాట తీస్తాడో ఎవరికీ అర్థం కాదు. అర్థం అయితే ఆయన ఆర్జీవీ ఎందుకవుతాడు? ఈ మధ్య కె.ఎ.పాల్ గురించి అదిరిపోయే కామెంట్స్ చేసిన వర్మ, ఇప్పుడు టాలెంటెడ్ బాలీవుడ్ యాక్ట్రెస్ కంగన రనౌత్‌ని పొగడ్తలతో ముంచెత్తాడు. జనరల్‌గా వర్మ అంటే వెటకారం చెయ్యాలి కదా, విచిత్రంగా పొగడడం ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇంతకీ ఆయన కంగనాని పొగడడానికి కారణం ఏంటంటే, కంగనా లేటెస్ట్ మూవీ, మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. జనవరి 25న దాదాపు 50 దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.
రీసెంట్‌గా ఈ సినిమా చూసి వర్మ, ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపాడు. మణికర్ణికలో కంగన నటన అద్భుతం, ఆమె తన అమోఘమైన ప్రతిభతో నన్ను ఆకట్టుకుంది. ఇంతటి టాలెంట్‌ని నేను చివరిసారి బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్‌లో చూసా, మళ్ళీ ఇన్నాల్టికి మణికర్ణికలో చూసా. కంగనను మిగతా యాక్షన్ హీరోలతో కంపేర్ చేసి చూస్తే, ఆమె ముందు వాళ్ళంతా హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు.. అంటూ తన స్టైల్‌లో కామెంట్ చేసాడు. మణికర్ణిక సినిమాని క్రిష్‌తో పాటు, కంగన కూడా కొంత పార్ట్ డైరెక్ట్ చేసింది. హిందీతో పాటు, తెలుగు అండ్ తమిళ్ భాషల్లోనూ మణికర్ణిక రిలీజ్ అయ్యింది.
Wowwwww #KanganaRanaut fucking swept me away with her sheer intensity in #Manikarnika ..Last I witnessed such fury and ferocity was only in BRUCE LEE in ENTER THE DRAGON .
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2019