RGV – Pushpa : ‘పుష్ప’ క్యారెక్టర్, అల్లు అర్జున్ పై ఆర్జీవీ రివ్యూ.. చాలా పెద్దగా ఓ రేంజ్ లో పొగుడుతూ రాసుకొచ్చాడే..
తాజాగా పుష్ప క్యారెక్టర్ పై ఆర్జీవీ రివ్యూ రాసాడు.

Ram Gopal Varma Review on Allu Arjun Pushpa Character Tweet goes Viral
RGV – Pushpa : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక పుష్ప సినిమాపై ఫ్యాన్స్, ప్రేక్షకులే కాక సెలబ్రిటీలు కూడా తెగ పొగుడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు పుష్ప పై పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుష్ప క్యారెక్టర్ ని పొగుడుతూ పుష్ప క్యారెక్టర్ పై నా రివ్యూ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. పుష్ప హవా మొదలైనప్పటి నుంచి ఆర్జీవీ రెగ్యులర్ గా పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఏదో ఒకటి రాసుకొస్తున్నాడు. తాజాగా పుష్ప క్యారెక్టర్ పై రివ్యూ రాసాడు.
Also Read : Pawan Kalyan : పోలీస్ జాగీలంతో డిప్యూటీ సీఎం షేక్ హ్యాండ్.. ఫొటో వైరల్..
ఆర్జీవీ పుష్ప క్యారెక్టర్ పై.. ఇలాంటి క్యారెక్టర్ ఇండియన్ ఫిలిమ్స్ లో చాలా రేర్ గా వస్తుంది. అంతకంటే అసలు ఒక స్టార్ అతని ఇమేజ్ ని పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం గ్రేట్. ఒక ఆడియన్ గా పుష్ప లాంటి క్యారెక్టర్ చూడటం చాలా రేర్ గా జరుగుతుంది. ఆ క్యారెక్టర్ చూసి నేను పుష్ప లాంటి క్యారెక్టర్ నిజంగానే ఉందేమో అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు వచ్చే మాములు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి క్యారెక్టర్ ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. పుష్ప క్యారెక్టర్ అమాయకత్వం, మోసం, సూపర్ ఈగో ఇవన్నీ మిక్స్ చేసారు. ఒక వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ హీరోగా ఎదుగుతాడని నేను అస్సలు నమ్మలేదు ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ హీరో అంటే ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగానే చూపించారు. కానీ పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని చాలా స్ట్రాంగ్ గా మార్చుకొని ఇంతవరకు చూడని బాడీ లాంగ్వేజ్ తో, హావభావాలతో చూపించారు. అది దశాబ్ద కాలాల పాటు ఒక రిఫరెన్స్ పాయింట్ గా గుర్తుంటుంది. వాళ్లకు ఇచ్చిన సీన్స్ లో ఏ యాక్టర్ అయినా కావాల్సిన దానికన్నా ఎక్కువ నటించడం ఈజీ కానీ అల్లు అర్జున్ రియల్ గా అనిపించని సన్నివేశాలను కూడా రియల్ గా అనిపించేవిధంగా పర్ఫెక్ట్ గా నటించారు. అసలు క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయిందా సినిమా క్యారెక్టర్ కి ప్లస్ అయిందా చెప్పడం కష్టం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కేవలం బాడీ లాంగ్వేజ్ తోనే కాదు అతని ఎమోషన్స్ తో కూడా మెప్పించాడు. సీఎం ఫొటో ఇవ్వనన్నప్పుడు, తాగి సారి చెప్పడానికి వచ్చిన సీన్స్ లో అతని ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇది చెప్తున్నందుకు సారీ చెప్తున్నా కానీ పుష్ప క్యారెక్టర్ ఎంజాయ్ చేసిన తర్వాత రియల్ అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ కంటే తక్కువే అనిపిస్తాడు అంటూ రాసుకొచ్చాడు. ఆర్జీవీ పుష్పని, అల్లు అర్జున్ ని ఈ రేంజ్ లో పొగడటంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ ని తెగ షేర్ చేస్తున్నారు.
My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2
—Ram Gopal VarmaIt is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character
Seeing…
— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024